టీఆర్ ఎస్ ఎమ్మెల్యేపై కేసు నమోదు..ఏంచేశారంటే!

Update: 2020-05-21 12:10 GMT
తెలంగాణలో అధికార టీఆర్ ఎస్ పార్టీ ఎమ్మెల్యే నన్నపనేని నరేందర్ మీద పోలీసులు కేసు నమోదు చేశారు. వరంగల్ తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే అయిన నరేందర్ లాక్ డౌన్ నిబంధనలను ఉల్లంఘించారంటూ వరంగల్ అర్బన్ జిల్లా బీజేపీ వైస్ ప్రెసిడెంట్ హరీశ్ శంకర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆ నియోజకవర్గంలోని 25 డివిజన్లలో ఉన్న పేదలకు నిత్యావసర సరుకులు అందించే సమయంలో ఎమ్మెల్యే నరేందర్ లాక్ డౌన్ నిబంధనలను పాటించలేదని తన ఫిర్యాదులో పొందుపరిచారు.

దాదాపుగా 3000 మంది ఉన్నచోట కనీసం సామాజిక దూరం పాటించలేదని వారు ఆరోపించారు. అలాగే ఆ కార్యక్రమానికి సంబంధించిన ఫొటోలను బీజేపీ నేత పోలీసులకు ఇచ్చారు. ప్రజలు అందరూ వరుసగా కూర్చుని ఉన్నారు అని, వారిలో ఏ ఒక్కరు కూడా సామాజిక దూరం పాటించలేదంటూ ఆ ఫొటోలను చూపించారు. దీనితో ఆ ఫోటోలని ఆధారంగా చేసుకుని ఎమ్మెల్యే పై పోలీసులు కేసు నమోదు చేశారు. గతంలో ఆరెంజ్ జోన్‌లో పర్యటించారంటూ బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ మీద పోలీసులు కేసు నమోదు చేశారని గుర్తు చేశారు. ఏపీలో కూడా ఈ విధంగానే పలువురు అధికార పార్టీ ప్రజాప్రతినిధులపై కేసుల నమోదైన సంగతి తెలిసిందే.
Tags:    

Similar News