మేయ‌ర్ మ‌ర్డ‌ర్​:​ అనుమానమే నిజ‌మా?!

Update: 2015-11-17 12:37 GMT
చిత్తూరు మేయర్‌ అనురాధ హత్య నేపథ్యంలో దర్యాప్తును ముమ్మరం చేశారు. హ‌త్య జ‌రిగిన‌ వెంటనే రంగంలోకి దిగిన క్లూస్‌ టీమ్‌ కారణాలు విశ్లేషించే పనిలో ప‌డింది. ఈ క్ర‌మంలో డాగ్‌ స్వ్యాడ్స్‌ ను రంగంలోకి దింపి అనుమానితుల‌ను ప‌ట్టుకునే క్ర‌మంలో కీలక ముంద‌డుగు ప‌డింది. గ‌తంలో నుంచి మేయ‌ర్ అనురాధ భ‌ర్త క‌టారి మోహ‌న్‌ - ఆయ‌న‌ మేనల్లుడు చింటూ అనే వ్య‌క్తికి మ‌ధ్య త‌గాదాలు ఉన్నాయి. ఈ క్ర‌మంలోనే హ‌త్య జ‌రిగింద‌ని భావిస్తున్నారు.

ప్రత్యక్ష సాక్షుల కథనం మేరకు ముగ్గురు వ్యక్తులు బురఖాలు ధరించి లోపలకు వచ్చారని అంటున్నారు. కత్తులు తుపాకులతో ప్రవేశించిన వారు మేయర్‌ దంపతులపై పాయింట్‌ బ్లాంక్‌ రేంజ్‌ లో కాల్పులు జరిపినట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది. అనురాధ గన్‌ మెన్లు సెలవులో ఉండటాన్ని పరిగణనలోకి తీసుకుని కూడా వారు ఈ దాడికి దిగారని చెబుతున్నారు. పోలీసుల జాగిలాలు కార్పొరేషన్‌ కార్యాలయం నుంచి మోహన్‌ చింటూ నివాసం వద్దకు వెళ్లి ఆగిపోవడంతో ఆ దిశగా పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.

తెలుగుదేశం శ్రేణులు సైతం చింటూపై ఆరోపణలు చేస్తున్నారు. ఈ క్ర‌మంలో చింటూ నివాసంపై దాడి చేసిన‌ట్లు స‌మాచారం. మ‌రోవైపు మోహ‌న్‌తో త‌న‌కున్న త‌గాదాలు ప‌రిష్క‌రించే విష‌యంలో పోలీసులు నిర్ల‌క్ష్యంగా వ్య‌వ‌హ‌రిస్తున్నార‌ని చింటూ గ‌తంలో ఆరోపించారు. ఇదిలాఉండ‌గా చింటూ లొంగిపోయిన‌ట్లు స‌మాచారం.
Tags:    

Similar News