ఆయన అలాంటి ఇలాంటి వ్యక్తి కాదు. తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి. మరి.. అలాంటి అత్యుత్తమ స్థానంలో ఉన్న అధినేతకు భద్రత కల్పించే అధికారుల ఎంపిక విషయంలో ఎలా వ్యవహరిస్తారన్నప్పుడు.. మెరికల్లాంటోళ్లు.. కమిట్ మెంట్ ఉన్న వాళ్లకే అవకాశం లభిస్తుందని చెబుతారు. కానీ.. ఇందుకు భిన్నంగా కేసీఆర్ ఫామ్ హౌస్ లో డ్యూటీ చేస్తున్న హెడ్ కానిస్టేబుల్ వెంకటేశ్వర్లు సూసైడ్ నేపథ్యంలో.. అతడు మద్యానికి బానిసై.. 13 సార్లు క్రమశిక్షణ చర్యలు తీసుకున్నట్లుగా పోలీసు ఉన్నతాధికారులు ప్రకటన విడుదల చేయటంపై ఆగ్రహం వ్యక్తమవుతోంది.
మద్యానికి బానిసైన వ్యక్తికి సీఎం భద్రత కోసం ఎంపిక చేస్తారా? అన్న సూటి ప్రశ్నను సంధిస్తున్నారు. మహిళను హింసించి.. అసభ్యంగా ప్రవర్తించిన ఘటనలో పద్నాలుగేళ్ల క్రితం (2005లో) విధుల నుంచి తొలగించిన వ్యక్తికి సీఎం వ్యవసాయ క్షేత్రంలో పోస్టు వేయరు కదా? అన్న ప్రశ్నలో లాజిక్ ఉంది. మరి.. ఈ విషయంలో అధికారుల వాదన ఏమిటి? అన్నది ప్రశ్నగా మారింది.
పటిష్టమైన భద్రత ఉండాల్సిన చోట.. నిర్లక్ష్యంగా.. బాధ్యతారాహిత్యంతో పని చేసే ఉద్యోగికి ఎలా పోస్ట్ ఇచ్చారన్న ప్రశ్న పోలీసు శాఖను ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. వ్యసనాల బారిన వ్యక్తికి ముఖ్యమంత్రితో పాటు పలువురు ప్రముఖులు తిరిగే చోట విధులు అప్పగించటం ఎలా? అన్న ప్రశ్నకు సమాధానం చెప్పలేక పోలీసు బాసులు తలలు పట్టుకుంటున్నట్లు తెలుస్తోంది. మరీ.. అనుమానాలపై పోలీసు అధికారులు క్లారిటీ ఇవ్వాల్సిన అవసరం ఉందంటున్నారు. వెంకటేశ్వరరావు లెక్కన.. విధుల విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరించే వారు ఇంకెంతమంది ఉన్నారన్నది ఇప్పుడు మరో క్వశ్చన్ గా మారిందని చెప్పక తప్పదు.