మాజీ స్పీకర్ - టీడీపీ సీనియర్ నేత కోడెల శివప్రసాద్ రావు ఆత్మహత్య వ్యవహారం ఏపీలో తీవ్ర దుమారం రేపిన సంగతి తెలిసిందే. ఆయన మృతిపై ఏపీలోని అధికార - ప్రతిపక్షాలు పరస్పర విమర్శలు చేసుకున్నాయి. కోడెల మృతదేహంతో టీడీపీ పెద్ద రాజకీయం చేసిందన్న విమర్శలు వెల్లువెత్తాయి.
కాగా కోడెల ఆత్మహత్య వివాదాస్పదం కావడంతో తెలంగాణ పోలీసులు సీరియస్ గా తీసుకున్నారు. తాజాగా ఆయన గదిని సీజ్ చేసి కాల్ డేటాపై దృష్టిసారించారు. ఆయన ఫోన్ కనిపించకపోవడంతో సర్వీస్ ప్రొవైడర్ల ద్వారా ఆయన చనిపోవడానికి ముందు ఈనెల 16న ఉదయం ఎవరితో మాట్లాడారనేది ఆరాతీస్తున్నారు.
తాజాగా పోలీసులు ఉదయం దాదాపు 10 నుంచి 12 ఫోన్ కాల్స్ కోడెల మాట్లాడినట్టు పోలీసులు గుర్తించారు. చివరి ఫోన్ కాల్ తన గన్ మెన్ అయిన ఆదాబ్ తో 9 సెకన్ల పాటు మాట్లాడారని పోలీసులు గుర్తించారు. అంతకుముందు తెలిసిన వారితో ఒకటి రెండు నిమిషాల చొప్పున మాట్లాడారని పోలీసులు గుర్తించారు.
ఇక కోడెల ఆత్మహత్యపై అనుమానాలున్నాయన్న ఫిర్యాదు రావడంతో ఈ కేసులో కోడెల ఇంట్లోని కొన్ని వస్తువులను పోలీసులు సీజ్ చేసి ఫోరెన్సిక్ ల్యాబ్ కు పంపారు. కోడెల గదిలోని కొన్ని ట్యాబ్లెట్స్ ను కూడా స్వాధీనం చేసుకున్నారు. చివరగా ఆయనతో ఉన్న ఇంట్లోని మనుషులను విచారిస్తున్నట్టు తెలిసింది.