భూమా అఖిల ప్రియ.. కర్నూలు జిల్లా ఆళ్ల గడ్డ ఎమ్మెల్యే.. ఏపీటూరిజం మంత్రి. భూమా నాగిరెడ్డి ఈ నియోజకవర్గంలో తిరుగులేని నేతగా ఉండేవారు. ఆయన మరణం తర్వాత కుమార్తె అఖిలప్రియ ఈ నియోజకవర్గ ఎమ్మెల్యే అయ్యారు. అయితే ఇక్కడ దశాబ్ధాలుగా భూమా - గంగుల కుటుంబాల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేలా ఫ్యాక్షన్ పగడ ఉంది. అది ప్రతీ సారీ రగులుతూనే ఉంటుంది.
ఈ ఎన్నికల్లో టీడీపీ తరుఫున ఆళ్లగడ్డ నుంచి మరోసారి భూమా అఖిలప్రియ రంగంలోకి దిగారు. ఇక వైసీపీ నుంచి వీళ్ల ప్రత్యర్థి గంగుల భీజేంద్ర రెడ్డికి జగన్ టికెట్ ఇచ్చారు. దీంతో మరోసారి ఆళ్లగడ్డలో యుద్ధవాతావరణం కనిపించింది. అయితే ఎన్నికలు ముగిశాయి. పోలింగ్ లో ఇరు పార్టీలు సత్తా చాటాయి. అంతా ముగిసిపోయిందనుకుంటున్న తరుణంలో ఇప్పుడు టీడీపీ సిట్టింగ్ ఎమ్మెల్యే భూమా అఖిల ప్రియ భర్త భార్గవ్ రామ్ అరెస్ట్ తప్పేలా కనిపించడం లేదు. ఆయన హత్యాయత్నం కేసు నమోదు కావడంతో పోలీసులు అరెస్ట్ చేసేందుకు రంగం సిద్ధం చేశారు.
భూమా - గంగుల కుటుంబాల మధ్య దశాబ్ధాలుగా కర్నూలు జిల్లా ఫ్యాక్షన్ గొడవలున్నాయి. కానీ అఖిలప్రియను పెళ్లి చేసుకున్న భార్గవ్ రామ్ కు మాత్రం ఈ గొడవలతో ఎటువంటి సంబంధం లేదు. ఆయనకు హైదరాబాద్ లో విద్యాసంస్థలున్నాయి. క్లీన్ ఇమేజ్ ఉంది. కానీ భూమా అఖిలప్రియను వివాహం చేసుకున్నాక భార్గవ్ రామ్ కూడా ఆమెకు తోడుగా కర్నూలులోనే ఉంటున్నారు.
ఈ కోవలోనే ఇటీవల ఆళ్లగడ్డలో పోలింగ్ వేళ భూమా - గంగుల కుటుంబాల మధ్య జరిగిన ఘర్షణలు కలకలం రేపాయి. ముఖ్యంగా అహోబలంలో గంగుల - భూమా వర్గీయులు పరస్పరం దాడులు - ప్రతిదాడులతో విరుచుకుపడ్డారు. ఈ దాడుల్లో సీఆర్పీఎఫ్ జవాన్లతోపాటు 50 మందికి తీవ్రగాయాలయ్యాయి. సీఆర్పీఎఫ్ జవాన్లు అయితే నడిరోడ్డుపై కూలబడిపోయారు.
ఈ ఘటనలోనే 90మంది పై హత్య యత్నం కేసు పెట్టారు పోలీసులు. భూమా అఖిలప్రియ చెల్లెలు భూమా మౌనికతోపాటు అఖిలప్రియ భర్త భార్గవ్ రామ్ - గంగుల కుటుంబంపై కూడా హత్యాయత్నం కేసు నమోదు చేశారు. వీరిని అరెస్ట్ చేసేందుకు పోలీసులు రంగం సిద్ధం చేశారు. అయితే భూమా - గంగుల ఫ్యామిలీకి ఈ హత్యయత్నం కేసులు కొత్తకాదు. ఎటు తిరిగి అఖిలప్రియను వివాహం చేసుకున్న భార్గవ్ రామే తొలిసారి హత్యయత్నం కేసులో ఇరుకున్నారు. ఈ నేపథ్యంలో భార్గవ్ రామ్ - భూమా మౌనిక అరెస్ట్ కాకుండా హైకోర్టులో క్యాష్ పిటీషన్ వేశారు. ఇలా భూమా నాగిరెడ్డి చనిపోయినా ఇంకా ఫ్యాక్షన్ పడగ వెంటాడుతోంది. ఇప్పుడు అఖిలప్రియ భర్త - చెల్లెలను పోలీసులు అరెస్ట్ చేస్తారా లేదా అన్న ఉత్కంఠ నెలకొంది.