డ్ర‌గ్స్ ఎపిసోడ్‌:వారిలో ఒక్క‌రు దొరికిపోయాడ‌ట‌

Update: 2017-12-20 05:56 GMT
రెండు తెలుగు రాష్ట్రాల‌తో పాటు.. యావ‌త్ దేశం దృష్టిని ఆక‌ర్షించిన డ్ర‌గ్స్ కేసుకు సంబంధించి కీల‌క అంశం ఒక‌టి బ‌య‌ట‌కు వ‌చ్చింది. కొన్ని నెల‌ల క్రితం దాదాపు నెల రోజుల‌కు పైనే హాట్ టాపిక్ గా న‌డిచిన మాద‌క ద్ర‌వ్యాల వినియోగం కేసులో ప‌లువురు సినీ సెల‌బ్రిటీల‌తో పాటు.. మ‌రికొంద‌రిని అనుమానించిన సంగ‌తి తెలిసిందే.

డ్ర‌గ్స్ వినియోగంలో సంబంధాలు ఉన్న‌ట్లుగా అనుమానించి వారికి నోటీసులు అందించారు. వారిని ప్ర‌త్యేకంగా విచారించారు  కూడా. విచార‌ణ స‌మ‌యంలో పెద్ద ఎత్తున ప్రాధాన్య‌త ల‌భించినా.. విచార‌ణ పూర్తి అయ్యాక‌.. ద‌ర్యాప్తు వ్య‌వ‌హారం నెమ్మ‌దించినట్లుగా విమ‌ర్శ‌లు వెల్లువెత్తాయి.

కేసును నీరుగార్చేందుకు భారీగా ప్ర‌య‌త్నాలు మొద‌ల‌య్యాయ‌న్న ఆరోప‌ణ వ్య‌క్త‌మైంది. అయితే.. ఇలాంటివి న‌మ్మొద్ద‌ని.. ద‌ర్యాప్తు ప‌క్కాగా జ‌రుగుతుందంటూ అధికారులు స్ప‌ష్టం చేశారు. అయితే.. అలాంటిది జ‌ర‌గ‌ద‌న్న అనుమానాన్ని ప‌లువురు వ్య‌క్తం చేశారు. ఇదిలా ఉంటే.. తాజాగా డ్ర‌గ్స్ కేసుకు సంబంధించి కీల‌క‌మైన ఫోరెన్సిక్ నివేదిక కోర్టుకు చేరింది. అయితే.. దీనికి సంబంధించిన వివ‌రాలు ఏమీ బ‌య‌ట‌కు రాలేదు.

విశ్వ‌స‌నీయ వ‌ర్గాల స‌మాచారం ప్ర‌కారం డ్ర‌గ్స్ కేసుకు సంబంధించిన కోర్టులో దాఖ‌లు చేసిన‌ కీల‌క‌మైన అభియోగ ప‌త్రంలో సినీ ప‌రిశ్ర‌మ‌కు చెందిన ఒక‌రి న‌మూనాలో మాద‌క‌ద్ర‌వ్యాల అవ‌శేషాలు క‌నిపించిన‌ట్లుగా తెలుస్తోంది.  అయితే.. ఎవ‌రా వ్య‌క్తి అన్న‌ది మాత్రం బ‌య‌ట‌కు రావ‌టం లేదు. ఇక‌.. త‌మ‌పై వ‌స్తున్న ఆరోప‌ణ‌ల్ని కొట్టిపారేస్తున్నారు సిట్ అధ‌కారులు.

డ్ర‌గ్స్ కేసును ప‌క్క‌దారి ప‌ట్టించ‌టం కోస‌మే విచార‌ణ ఆల‌స్య‌మైంద‌న్న మాట‌లో నిజం లేదంటున్నారు. న్యాయ‌స్థానంలో తాము స‌మ‌ర్పించే ఆధారాలు కీల‌కంగా మార‌టంతో పాటు.. సాంకేతికంగా ఎవ‌రూ త‌ప్పు ప‌ట్ట‌ని రీతిలో ఉండాల‌న్న ఉద్దేశంతో న‌మూనాల్ని రెండో సారి కూడా విశ్లేష‌ణ‌లకు పంపిన‌ట్లు చెబుతున్నారు. ఈ కార‌ణంతోనే మొత్తం ప్ర‌క్రియ ఆల‌స్య‌మైంద‌ని చెబుతున్నారు.

కెల్విన్ ద్వారా మాద‌క‌ద్ర‌వ్యాలు సినీ పరిశ్ర‌మ‌కు చెందిన కొంద‌రికి అందిన‌ట్లుగా ఆరోప‌ణ‌లు రావ‌టం తెలిసిందే. దీనికి సంబంధించి ప‌లువురిని విచారించిన సిట్‌.. విచార‌ణ‌కు హాజ‌రైన ప‌లువురి నుంచి శాంపిల్స్ ను సేక‌రించారు. అలా త‌మ శాంపిల్స్ ఇచ్చిన వారిలో ఒక‌రి విష‌యంలో ఆధారాలు ల‌భ్యమ‌య్యాయ‌న్న మాట వినిపిస్తోంది. అదే నిజ‌మైన ప‌క్షంలో.. ఒక్క‌రే ఎందుక‌న్న సందేహాలు వ్య‌క్తం కావ‌టం ఖాయం.ఏది  ఏమైనా రానున్న రోజుల్లో మాత్రం.. డ్ర‌గ్స్ కేసు మ‌ళ్లీ సంచ‌ల‌నాల బాట ప‌ట్టే అవ‌కాశాలు ఉన్నాయ‌ని చెప్పక త‌ప్ప‌దు.
Tags:    

Similar News