తెలుగు రాష్ర్టాల్లో సంచలనం సృష్టించడమే కాకుండా దాదాపు నెల రోజుల పాటు రాష్ట్రాన్ని ఒక కుదుపు కుదిపిన నార్కొటిక్ డ్రగ్స్ (ఎల్‌ఎస్‌డి) కేసులో ఏం జరగబోతోంది? సినీ పరిశ్రమలో కలకలం రేపిన ఈ కథ కంచికి చేరినట్లేనా? అంటే అవుననే సమాధానం వస్తోంది. డ్రగ్స్ వినియోగం, విక్రయంతో సంబంధాలున్నాయన్న అనుమానంతో ఎక్సైజ్ శాఖ అధికారులు చరిత్రలో ఎన్నడూ లేని విధంగా భారీ హడావిడి చేయడంతో పాటు పలువురు సినీ ప్రముఖులను కూడా విచారించారు. ఒక్కో నటుడిని పదేసి గంటలకు పైగా విచారించడం, వారి నుంచి గోళ్ళు - రక్తం - ఉమ్మి తదితర వాటి నమూనాలను తీసుకోవడంతో కేసు తీవ్రతపై రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారిన విషయం తెలిసిందే. ఒక దశలో నటులను రెండవ విడత విచారణ కూడా చేయనున్నారన్న వార్తలు కూడా వెలువడ్డాయి.
తాజాగా ఈ కేసుపై ఆరా తీయగా ఎవరినీ విచారించేది లేదని - అరెస్టులు కూడా చేసేది లేదని - కోర్టులలో చార్జిషీట్ లు దాఖలు చేయడం కూడా అనుమానమేనని తెలిసింది. సినీ ప్రముఖులు చాలా మంది ఈ విషయాన్ని ఇంతటితో వదిలేయాలని - పరువు తీయడం సరైంది కాదని ప్రభుత్వంతో మొర పెట్టుకోవడమే కారణమని కొందరు అంటున్నారు... మరి ఇందులో నిజాలేంటో ప్రభుత్వమే చెప్పాలి . సమాజానికి సినిమాల ద్వారా సందేశాన్ని అందిస్తున్న నటులపై వేధింపులకు పాల్పడుతున్నారంటూ గతంలోనే పలువురు సినీ రంగ ప్రముఖులు వ్యాఖ్యానించడంతో పాటు కొంత మంది ముఖ్యమంత్రి కేసీఆర్ తో పాటు పలువురు మంత్రులను కలిసి విషయం తెలిసిందే. డ్రగ్స్ వినియోగం - విక్రయంతో సినీ రంగంతో ఏ మాత్రం సంబంధం లేదని వారు పేర్కొన్న విషయం కూడా తెలిసిందే. ఎల్ ఎస్ డీ డ్రగ్స్‌ను గోవా ద్వారా హైదరాబాద్ కు చేరవేస్తున్న విషయాన్ని దర్యాప్తులో తేల్చిన ఒక బృందం అక్కడకు వెళ్ళింది. అయితే డ్రగ్స్ విక్రయదారులు ఇక్కడి నుంచి అధికారుల బృందం వెళ్ళేలోగానే వారు సర్ధుకున్నారు.
మరోవైపు సినీ నటులను విచారిస్తున్న సందర్భంగానే అధికారులు నెదర్లాండ్ కు చెందిన మైక్ కమింగో అనే డ్రగ్స్ విక్రయదారుడిని అరెస్టు చేశారు. అతడిచ్చిన సమాచారం ఆధారంగా విదేశాలలోని డ్రగ్స్ విక్రయదారులపై సమాచారం కోసం ఆయా రాయబార కార్యాలయాలకు లేఖలు రాసిన ఇంత వరకు స్పందన లేకపోవడం కూడా కేసును మూసి వేసేందుకు మరో కారణమని అంటున్నారు. రాష్ట్రంలో విచ్చలవిడిగా ఎల్ ఎస్ డి డ్రగ్స్ ను సరఫరా చేస్తున్న విదేశీ డ్రగ్స్ ముఠాలను పట్టుకునేందుకు ప్రయత్నించినా ఫలితాలేవీ ఫలించక పోవడంతో కేసును మూసి వేయాలని నిర్ణయించినట్లు ఎక్సైజ్ వర్గాల్లో ప్రచారం సాగుతోంది.