టీ తాగి , కేక్ తిన్నది .. తెల్లారేసరికి బ్రతుకు చీకటైపోయింది .. చివరికి ఆ పనికోసం వచ్చిన పోలీసే.. !

Update: 2020-09-06 01:30 GMT
ఓ పేద యువతీ , తండ్రి చనిపోవడంతో తల్లిని , చెల్లిని జాగ్రత్తగా చూసుకుంటూ వచ్చింది. పసితనంలోనే వారి కోసం కష్టపడటం మొదలుపెట్టింది. ఎన్ని కష్టాలు వచ్చినా తన వారికోసం అన్ని ఇష్టంగానే అనుభవించింది. కానీ , అనుకోని విధంగా పరిచయం అయిన ఓ యువతీ చేసిన మోసానికి బందీగా మారి ఆరేళ్ళ పాటు కామాంధుల కోరికలు తీర్చాల్సి వచ్చింది. ఆ తర్వాత ఓ పోలీస్ చొరవ తో ఆ చెరశాల నుండి బయటపడింది. ఇటీవల 'హ్యూమన్స్ ఆఫ్ బాంబే' ప్రచురించిన ఆమె కథనం సోషల్ మీడియాలో వైరల్‌ అవుతుంది.

నాకు 10 ఏళ్ల వయసున్నప్పుడు నాన్న చనిపోయారు. అమ్మ అనారోగ్యం బారినపడింది. దీంతో తల్లిని,చెల్లిని పోషించే భారం నాపై పడింది. ఆ క్రమంలో కోల్‌కతాలోని ఓ ఫ్యాక్టరీలో పనికి కుదిరాను. అయితే కొన్నాళ్లకు ఫ్యాక్టరీ మూతపడటంతో మళ్లీ కష్టాలు మొదలయ్యాయి. అలాంటి తరుణంలో నాతో పాటు రోజూ రైళ్లో ప్రయాణించే కకోలి విశ్వాస్ అనే మహిళ హల్దియాలో నాకో జాబ్ ఆఫర్ చేసింది. ఓరోజు ఆమెతో పాటు హల్దియాకు బయలుదేరాను అని హ్యూమన్స్ ఆఫ్ బాంబే ప్రచురించిన కథనంలో బాధితురాలు చెప్పారు. ఆరోజు నేను చాలా థ్రిల్ అయ్యాను. మార్గమధ్యలో ఆమె ఓచోట నాకు టీ,కేక్ ఇచ్చింది. వాటిని తీసుకున్న కాసేపటికే స్పృహ కోల్పోయాను. కళ్లు తెరిచే చూసేసరికి పుణేలో ఓ ఇంట్లో ఉన్నాను. అక్కడ దాదాపు 30 మంది అమ్మాయిలు ఉన్నారు. ఏం జరుగుతుందో అర్థమయ్యే లోపే , నన్ను బడీ దీదీకి అమ్మేశారని చెప్పారు. నేనింకా నోరు విప్పకముందే... నువ్వు ప్రతీరోజూ ఇక్కడకు వచ్చే అబ్బాయిలతో పడకను పంచుకోవాలని బడీ దీదీ చెప్పింది అని ఆ బాధితురాలు చెప్పారు. అయితే మొదట వారు చెప్పింది వినకపోవడంతో రెండు నెలలు పాటు ఇనుప కడ్డీలతో కొట్టి , రూమ్ లో బంధించారని , ఆ తరువాత రోజుకి 10 నుండి 12 మంది తో వ్యభిచారం చేయించేవారని చెప్పింది. ఒకరోజు అక్కడికి వచ్చిన వారి నుండి ఫోన్ తీసుకోని మావయ్య కి ఫోన్ చేద్దాం అనుకుంటే .. దీదీ పట్టేసింది అని తెలిపింది.

అలాగే కొద్దిరోజుల గడిచిపోయిన తరువాత ... నా దగ్గరకు వచ్చే విటుల్లో ఒక పోలీస్ అధికారి కూడా ఉన్నట్లు తెలుసుకున్నాను. ఆయన అక్కడికి వచ్చినప్పుడు సహాయం చేయమని కోరాను. అందుకు ఆయన ఒప్పుకొని , నన్ను తనతో పాటు తీసుకెళ్లి తిరిగి వ్యభిచార గృహంలో దిగబెడుతానని బడీ దీదీతో చెప్పాడు. దానికి ఆమె ఒప్పుకుంది. దీంతో నన్ను తనతో పాటు బయటకు తీసుకొచ్చిన ఆ పోలీస్ అధికారి నేరుగా రైల్వే స్టేషన్ ‌కు తీసుకొచ్చి కోల్ ‌కతా రైలు టికెట్ ,అలాగే మరో రూ.3వేలు ఇచ్చారు. అలా ఆరేళ్ల తర్వాత నేను ఇంటికి చేరుకుని మా అమ్మను కలుసుకోగలిగాను అని చెప్పుకొచ్చారు. ఆలా ఆ ఊబి నుండి బయటపడిన కొద్దిరోజుల వరకు అసలు బయటకి రాలేదని , ఎవరితోనూ మాట్లాడేదాన్ని కాదు. ఓ ఎన్‌జీవో నన్ను ప్రోత్సహించడంతో ఎట్టకేలకు పోలీసులకు ఫిర్యాదు చేశాను. వాళ్ల సహకారంతోనే ఓ ఎంబ్రాయిడరీ ఫ్యాక్టరీలో పనికి కుదిరాను. ఏదో రోజు నా తల్లికి సొంతిల్లు కొనాలనేది నా కల. ఇప్పటికీ గాయాలు బాధిస్తున్నాయి. అయితే నా భవిష్యత్తు పైనే ఫోకస్ చేయాలనుకుంటున్నాను. అలాగే నాలాగా అన్యాయానికి గురవుతున్న అమ్మాయిల కోసం నావంతుగా ఏదైనా చేయాలనుకుంటున్నాను అని ఆ బాధితురాలు వెల్లడించారు



Tags:    

Similar News