విపరీతమైన పని కారణంగా నిత్యం ఒత్తిడిలో ఉండే పోలీసుల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అలాంటి పోలీసులు కూడా సామాజిక బాధ్యతను గుర్తించి యువత కోసం మంచిపని చేస్తున్నారు. వైజాగ్, తూర్పుగోదావరి ఏజెన్సీ ప్రాంతాల్లోని యువతలో కొందరు గంజాయి వ్యాపారంలో బాగా బిజీగా ఉంటున్న విషయం అందరికీ తెలిసిందే. అలాంటి వారిని గంజాయి వ్యాపారం నుండి పక్కకు మళ్లించేందుకు పోలీసులు వినూత్న కార్యక్రమాన్ని చేపట్టారు.
ఇంతకీ విషయం ఏమిటంటే ఏజెన్సీ ఏరియాల్లో బాగా చదువుకున్న యువతను గుర్తించి పెద్ద పెద్ద కంపెనీల్లో ఉద్యోగాలు ఇప్పించేందుకు పోలీసు అధికారులు కృషి చేస్తున్నారు. తూర్పుగోదావరి జిల్లాలోని చింతూరు ఏరియాలో సుమారు 1186 మంది యువతకు ఉద్యోగాలు ఇప్పించటం ఇపుడు టాక్ ఆఫ్ ది డిపార్టుమెంటుగా మారింది. జిల్లా ఎస్పీ రవీంద్రనాథ్ బాబు ఈమధ్య బాగా విస్తృతంగా ఏజెన్సీ ఏరియాల్లో పర్యటించారు. గంజాయి సాగు, రవాణా, బిజినెస్ లో ఎక్కువ యువతే ఉన్నట్లు గుర్తించారు.
యువతలో చైతన్యం తీసుకునేందుకు ఎస్పీ ఆధ్వర్యంలో చాలా సమావేశాలే జరిగాయి. ఈ సందర్భంగా యువతలో బాగా చదువుకున్న వారున్నట్లు ఎస్పీ గుర్తించారు. తమకు ఉద్యోగవకాలు రాకపోవటంతోనే ఈ వ్యాపారంలోకి దిగినట్లు చెప్పారు. దాంతో వెంటనే ఎస్సీ కొన్ని కంపెనీలతో మాట్లాడారు. విద్యార్హతల్లో తమకు సరిపడా యువత ఉంటే వెంటనే ఉద్యోగాలు ఇస్తామని లేకపోతే అవసరమైన శిక్షణ ఇప్పించి ఉద్యోగాల్లోకి తీసుకుంటామని కంపెనీలు కూడా హామీ ఇచ్చాయి.
వెంటనే పీవీఎస్ఆర్ గ్రూపు ద్వారా 27 కంపెనీలతో ఎస్పీ ఉద్యోగమేళా ఏర్పాటు చేశారు. ఈ మేళాలో కంపెనీలు తమకు అవసరమైన 1186 మంది యువతను ఉద్యోగాలకు ఎంపిక చేసుకున్నాయి. ఈ మేళాలో ఇద్దరు యువకులు ఆన్ లైన్ ఎడ్యుకేషన్ సంస్ధలో ఉద్యోగాల్లో చేరారట. వాళ్ళిద్దరికీ ఏడాదికి రు. 10 జీతాన్ని సదరు కంపెనీ ఫిక్స్ చేసింది. నిన్నటి వరకు గంజాయి వ్యాపారంలో ఉన్న యువత ఇపుడు కంపెనీలో చేరి ఏడాదికి 10 లక్షల రూపాయల జీతానికి కుదురుకున్నారంటే మామూలు విషయం కాదు.
ఇలాంటి ఉద్యోగ మేళాలు మరిన్ని నిర్వహించాలని పోలీసులు, కంపెనీలు కూడా డిసైడ్ అయ్యాయి. ఇలాంటి ఉద్యోగ మేళాలే తెలంగాణా పోలీసులు కూడా నిర్వహిస్తున్నట్లు సమాచారం. ఏదేమైనా పెడధోరణులు పడుతున్న యువతను మంచి మార్గంలో తీసుకురావటానికి పోలీసులు చొరవ చూపిస్తుండటం ఎంతైనా సంతోషించాల్సిన విషయమే.