రెండు వారాలుగా అటు మీడియాలోనూ.. ఇటు సోషల్ మీడియాలోనూ.. జనాల్లోనూ అదే పనిగా చర్చకు వస్తోంది బ్యూటీషియన్ శిరీష కేసు. తొలుత అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి.. తర్వాత ఆత్మహత్యగా చెప్పిన పోలీసుల తీరుపై పలువురు సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. పెద్ద ఎత్తున విమర్శలూ వెల్లువెత్తున్నాయి. ఈ ఉదంతంలో శిరీషతో ఎట్టి పరిస్థితుల్లో ఆత్మహత్య కానే కాదని.. హత్యగా ఆమె బంధువులు అదే పనిగా చెబుతున్నారు. మొన్నటి వరకూ శిరీషది ఆత్మహత్యగా చెప్పిన పోలీసులు సైతం తాజాగా ఆమెది హత్య అన్న కోణంలో విచారణ చేస్తున్నట్లుగా సమాచారం. దీనిపై ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడనప్పటికీ.. హత్య కోణంలో విచారణ జరిపితే కొత్త విషయాలు బయటకు వచ్చే అవకాశం ఉందని భావిస్తున్నట్లు చెబుతున్నారు.
ఇక.. శిరీష మరణానికి సంబంధించి ఇప్పటికే ఉన్న అనుమానాలు సరిపోనట్లుగా.. రోజురోజుకీ కొత్తగా పుట్టుకొస్తున్న సందేహాలు ఈ కేసును ఎక్కడి వరకూ తీసుకు వెళుతుందన్నది ఇప్పుడు ప్రశ్నగా మారింది. తాజాగా పోలీసుల కస్టడీలో ఉన్న రాజీవ్.. శ్రవణ్ లు సంచలన విషయాలు ఏమైనా చెబుతారా? అని వెయిటింగ్.
కస్టడీలో ఉన్న రాజీవ్.. శ్రవణ్‌లను వేర్వేరుగా విచారిస్తున్న పోలీసులు.. వారి నుంచి కొంత కీలక సమాచారాన్ని సేకరించినట్లుగా చెబుతున్నారు. శిరీష మృతి చెందిన తర్వాత ఆమెకు సంబంధించిన టేపులు విడుదల కావటం వెనుక ఎవరున్నారు? వాటిని ఎవరు బయటకు తెచ్చారన్న అంశంపైనా పోలీసులు దృష్టి సారించినట్లుగా తెలుస్తోంది. బయటకు విడుదలైన టేపుల్లో శిరీషతో మాట్లాడిన నందు.. నవీన్ లు ఎవరు? అన్న విషయంపై పోలీసులు ఆరా తీస్తున్నారట. తేజస్విని.. శిరీషలలో ఎవరిని వదిలించుకోవటానికి రాజీవ్ ప్లాన్ చేశాడు? అన్న అంశంపై పోలీసులు దృష్టి సారించారు. నందు ఎవరన్న విషయంపై తనకేం తెలీదని రాజీవ్ చెప్పినట్లుగా సమాచారం. దీంతో.. నందు ఎవరన్నది కనుక్కునే పనిలో పోలీసులు పడ్డారని తెలుస్తోంది. శిరీష లోదుస్తులపై మరకలు ఉన్న నేపథ్యంలో శిరీషపై అత్యాచారం జరిగిందా? అన్న అంశంపై పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు. శిరీష విషయంలో కుకునూరుపల్లి ఎస్ ఐ ప్రభాకర్ రెడ్డి తీరుపై రాజీవ్.. శ్రవణ్ లు తాజాగా ఆసక్తికర అంశాలు వెల్లడించినట్లుగా సమాచారం.
శిరీషను తాము గదిలో వదిలి బయట నిలుచున్నప్పుడు ఆమె కేకలు వినపడగానే కాస్త తలుపులు తెరిచామని.. ఆ సమయంలో శిరీషపై ఎస్ ఐ అత్యాచారానికి ప్రయత్నించాడని.. తాము తలుపులు తీసుకొని వెళ్లగానే.. అతను కోపంతో తమను బయటకు పంపినట్లుగా ఒప్పుకున్నట్లు తెలుస్తోంది. ఎస్ ఐ ప్రవర్తన శిరీషను బాగా కుంగదీసిందని తెలుస్తోంది.
ఇదిలా ఉంటే.. పోలీసుల విచారణలో శ్రవణ్ చెప్పిన సమాచారం పోలీసులకు కన్ఫ్యూజన్ గా మారిందంటున్నారు. రాజీవ్ కు తెలీకుండా తాను.. శిరీషలు తరచూ కలుస్తుండేవారమని చెప్పినట్లుగా చెబుతున్నారు. అదే సమయంలో హైదరాబాద్ కు తిరుగు ప్రయాణ సమయంలో కారులో శిరీషను పలుమార్లు కొట్టింది నిజమేనని రాజీవ్ పోలీసుల వద్ద ఒప్పుకున్నట్లుగా తెలుస్తోంది. వీటన్నింటికంటే మరింత షాకింగ్ విషయం ఏమిటంటే.. రాజీవ్ తో శిరీషకు సంబంధం ఉన్న నేపథ్యంతో తేజస్విని అంతు చూస్తానని బెదిరించిందని చెబుతున్నారు.
దీంతో శిరీష అడ్డు తొలగించుకోవటానికి బంజారాహిల్స్ రోడ్ నెంబరు 10లోని ఓ కాఫీ షాప్ లో మూడు గంటల పాటు స్కెచ్ ఆలోచించినట్లుగా రాజీవ్.. శ్రవణ్ లు పోలీసులకు చెప్పినట్లుగా తెలుస్తోంది. అయితే.. శిరీషను ఎందుకు వదిలించుకోవాలి? ఎలా వదిలించుకోవాలన్న విషయంపై మరింత సమాచారం బయటకు రావాల్సి ఉంది. కొంచెం కొంచెంగా వస్తున్న సమాచారాన్ని ఒకచోటకు కూరిస్తే అర్థమయ్యేదేమిటంటే.. శిరీష మరణం ఆత్మహత్య అన్నది అనుమానమేనని చెప్పక తప్పదు. ఆమె మరణం వెనుక పెద్ద విషయమే ఉందన్న సందేహం బలపడుతుందని చెప్పక తప్పదు.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/