టీడీపీ ఆఫీసుకు పోలీసుల నోటీసులు.. ఎందుకంటే

Update: 2021-10-23 11:32 GMT
టీడీపీ నేత పట్టాభిరామ్‌ సీఎం వైఎస్‌ జగన్‌ పై చేసిన అనుచిత వ్యాఖ్యల తర్వాత మంగళగిరిలోని టీడీపీ ప్రధాన కార్యాలయంపై వైసీపీ శ్రేణులు దాడి చేశారు. ఇదే సమయంలో.. రాష్ట్రంలోని పలు జిల్లాల్లోనూ దాడులు జరిగాయి. ఇక, ఇప్పటి వరకు పార్టీ కార్యాలయంపై దాడిచేసిన వారిపై చర్యలు తీసుకోలేదని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు. అయితే, ఇవాళ టీడీపీ కార్యాలయానికి మంగళగిరి పోలీసుల నోటీసులు ఇచ్చారు. కార్యాలయ ఉద్యోగి బద్రి ఇచ్చిన ఫిర్యాదు మేరకు విచారణలో భాగంగా సీసీ టీవీ ఫుటేజ్ ఇవ్వాలని ఆ నోటీసుల్లో పేర్కొన్నారు పోలీసులు. ఇవాళ సాయంత్రం 5 గంటల్లోగా మంగళగిరి రూరల్ పోలీస్ స్టేషన్‌కు వచ్చి వివరాలు అందివ్వాలని పార్టీ రిస్పెషన్ కమిటీ సభ్యుడు కుమార స్వామికి నోటీసులు అందజేశారు.

డీపీ ఆఫీస్‌పై దాడి కేసులో 10మందిని అదుపులోకి తీసుకున్నామని.. మరికొందరు నిందితుల కోసం నాలుగు టీమ్‌లను ఏర్పాటు చేసినట్లు గుంటూరు అర్బన్ పోలీసులు తెలిపారు. మంగళవారం మంగళగిరిలో ఉన్న టీడీపీ కేంద్ర కార్యాలయంపై దాడి చేసిన సంగతి తెలిసిందే. కొందరు కార్లలో వచ్చి కార్యాలయంలో ఫర్నీచర్‌ను ధ్వంసం చేశారు.. కార్యాలయంలో పనిచేసే సిబ్బందిపైనా దాడి చేశారు. ఆ పార్టీ నేతల ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఇటు టీడీపీ కూడా ఈ దాడికి నిరసనగా బుధవారం బంద్‌కు పిలుపునిచ్చింది. అలాగే ఆయన 36 గంటల పాటూ దీక్ష చేశారు. ఈ వ్యవహారంపై ఫిర్యాదు చేసేందుకు సోమవారం ఢిల్లీ వెళుతున్నారు.

పట్టాభి ఇంటిలోని సీసీ ఫుటేజీ డీవీఆర్ ఇవ్వమని కోరామని, డీవీఆర్ అందిన తర్వాత విచారణ మరింత వేగవంతం చేస్తామని సదరు ప్రకటనలో పేర్కొన్నారు. కాగా, పట్టాభి భార్య చందన ఇచ్చిన ఫిర్యాదు పై కేసు నమోదు చేసిన పడమట పోలీసులు.. రాత్రి పదకొండు మంది నిందితులను గుర్తించి అరెస్ట్ చేశారు. ఆ పదకొండు మంది విజయవాడకు చెందిన వారిగా గుర్తించారు. ఇంటి చుట్టు ప్రక్కల సిసి కెమెరాల ఆధారంగా పదకొండు మందిని గుర్తించామని, పట్టాభి ఇంట్లో ఉన్న డివిఆర్ ఇచ్చిన తర్వాత మిగిలిన వారిని గుర్తించి అరెస్ట్ చేస్తామని సీపీ శ్రీనివాసులు తెలిపారు.


Tags:    

Similar News