నయీం స్థలంలో నస్రీన్ అస్తిపంజరం!

Update: 2016-08-23 05:34 GMT
చెప్పుకుంటూపోతే కొన్ని సంవత్సరాల కాలం, రాసుకుంటూపోతే వందల దస్తాల కాగితం, తీసుకుంటూపోతే టిగాబైట్ స్థాయి వీడియో అవుతాయి నయీం క్రైం స్టోరీ విశేషాలు. తవ్వుకుంటూపోయే కొద్దీ నయీం అరాచకాలతో పాటు వాటి ఆనవాళ్లుగా ఎన్నో ఎన్నెన్నో విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. మనిషి మృగమైతే అనే స్థాయిలో నయీం అరాచకాలు ఇప్పాటివరకూ తెలుసుకున్నవారికి తాజాగా తెలిసిన ఈ విషయం గురించి వింటే ఒళ్లు గగ్గురుపాటుకు గురికాకతప్పదు.

తాజాగా నార్సింగి మంచిరేవుల శివారులోని ఓ ప్రాంతంలో ప్రహరీ నిర్మించి ఉన్న ఖాళీ స్థలంలో పోలీసులు ఒక అస్తిపంజరాన్ని వెలికి తీశారు. ఆ అస్తిపంజరంపై చిరిగిపోయిన ఎరుపురంగు గౌను మాత్రమే ఉండటంతో.. ఈ అస్తిపంజరం ఒక అమ్మాయిది అని ప్రథమికంగా గుర్తుపట్టిన పోలీసులు.. ఇది నయీం ఇంట్లో పని చేసిన నస్రీన్ (17)గా అనంతరం గుర్తించారు. నయీం అనుచరుడు ఫయీంను అదుపులోకి తీసుకొని విచారించడంతో ఈ హత్య వెలుగు చూసింది.

నయీం కేసుల్లో అతడు ఎంత క్రూరంగా వ్యవహరిస్తాడు అనేదానికి ఇది మరో మచ్చుతునకగా చెబుతున్నారు. ఈ ప్రాంతంలో హత్య చేసినవారి అస్థిపంజరాలు బయటపడుతుండటం ఇందుకు తాజా ఉదాహరణ. ఒకరోజు బంధువు అలీముద్దీన్ కూతురు అహెలా పెళ్లిచూపుల కార్యక్రమానికి హాజరయ్యేందుకు నయీం, అతని కుటుంబసభ్యులు సిద్ధమయ్యారట. ఆ సమయంలో అల్కాపురిలోని ఇంట్లో ఉండేందుకు నస్రీన్ నిరాకరించిందట. ఈ విషయమై చిన్నపాటి గొడవ కూడా జరగడంతో ఇంటిపై నుంచి కిందకు దూకేందుకు ఆమె ప్రయత్నించిందట. దీంతో కోపం కట్టలుతెంచుకున్న నయీం.. ఆమెను ఇంట్లోకి తీసుకువచ్చి, తీవ్రంగా కొట్టీ, నిద్రమాత్రలు మింగించి తర్వాత చంపేసాడని పోలీసులు వెల్లడిస్తున్నారు.

కాగా నయీం వ్యవహారంలో తెలంగాణవ్యాప్తంగా ఇప్పటివరకూ 34 కేసులు నమోదు చేసిన పోలీసులు నయీం కుటుంబ సభ్యులతోపాటు తన గ్యాంగ్‌ కు చెందిన మొత్తం 38 మందిని అరెస్టు చేశారు. ఈ వ్యవహారంలో ఫర్హానా, ఫయీం, అఫ్సానా, షహీన్‌ లను కస్టడీకి తీసుకుని విచారించిన పోలీసులు... అల్కాపురిలో హత్యకు గురైనవారు, ఆచూకీ లేకుండా పోయిన వారి వివరాలు రాబట్టేపనిలో ఉన్నారు.
Tags:    

Similar News