కడప జిల్లా పోట్లదుర్తిలోని టీడీపీ ఎంపీ సీఎం రమేష్ ఇంట్లో పోలీసుల సోదాల వ్యవహారం కొత్త మలుపు తిరిగింది. ఎంపీ ఇంట్లోకి 40మంది పోలీసులు ప్రవేశించి ఆయన బెడ్ రూమ్ లోనూ సోదాలు చేశారు. వారెంట్ లేకుండా తన ఇంటికి వచ్చి పోలీసులు వీరంగం సృష్టిస్తూ తనిఖీలు చేశారని సీఎం రమేష్ ఆరోపించారు.
అయితే ఈ వ్యవహారం పక్కా ప్రణాళికతో చేశారని.. కనీసం కడప జిల్లా ఎస్పీకి కూడా ఈ తనిఖీల సమాచారం తెలియదని బయటపడడం రాజకీయంగా సంచలనంగా మారింది.
కడప జిల్లాలోని సీఎం రమేష్ ఇంట్లో 40మంది పోలీసులు సోదాలు చేశారనే వ్యవహారంపై రకరకాల కథనాలు వెలువడ్డాయి. కేంద్ర ప్రభుత్వం, ఎన్నికల సంఘం ఆధ్వర్యంలోనే టీడీపీ నేతలపై దాడులు జరుగుతున్నాయని టీడీపీ పార్టీ నేతల గోలగోల చేసి పెద్ద ఎత్తున ప్రచారం చేశారు. జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకే తాము సోదాలు చేస్తున్నట్టు పోలీసులు చెప్పారని టీడీపీ నేతలు మీడియాకు తెలిపారు.
అయితే ఇప్పుడు అసలు విషయం వెలుగులోకి వచ్చింది. ఈ వ్యవహారంలో ఎర్రగుట్ల అర్బన్ ఇన్ స్పెక్టర్ బీవీ రమణ వ్యవహారశైలిపై అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ప్రొటోకాల్ ప్రకారం ఎంపీ - లేదా ఎమ్మెల్యే ఇంట్లో సోదాలు చేయాలంటే సంబంధిత డీఎస్పీ - ఎస్పీ - డీఐజీలకు సమాచారం అందించాల్సి ఉంటుంది. అయితే ఇవేమీ పాటించకుండా ఎర్రగుట్ల ఎస్సై ఎంపీ సీఎం రమేష్ ఇంట్లో ఉన్న సమయంలోనే సీనియర్ అధికారులకు సమాచారం ఇవ్వకుండా సోదాలకు వెళ్లడం అనుమానాలకు తావిస్తోంది.
*ఆంగ్ల పత్రిక కథనంతో బట్టబయలు
తాజాగా జాతీయ ఆంగ్ల పత్రిక కథనంతో దీనివెనుక గుట్టు రట్టయ్యింది. సీఎం రమేష్ నివాసంలో పోలీసులు సోదాల్లో జిల్లా ఎస్పీతోపాటు ఉన్నతాధికారులకు ఎవరికి సంబంధం లేదని ఆ కథనంలో పేర్కొన్నారు. కేవలం ఎస్పై స్థాయి అధికారి పోలీసుల బృందంతో సోదాలు చేశారని ఆంగ్ల పత్రిక పేర్కొంది. విశేషం ఏంటంటే ఆ అధికారి కర్నూలు జిల్లా నుంచి కడపకు ఇదే ఎంపీ సీఎం రమేష్ సిఫార్సుతోనే బదిలీ అయ్యారని పత్రిక బాంబు పేల్చింది.
కేవలం ఎన్నికల వేళ - పార్టీపై ప్రజల్లో సానుభూతి పొండం.. ఇతర పార్టీల పై ఆరోపణలు చేయడం కోసమే ఈ రకంగా వ్యవహరించారనే ఆరోపణలు వెల్లువెత్తాయి. ఆంగ్ల పత్రికలో వచ్చిన కథనాన్ని బీజేపీ నేతలు ప్రస్తావిస్తూ టీడీపీ కుటిల రాజకీయాలను బయటపెట్టారు. ఇదంతా టీడీపీ ముందస్తు ప్రణాళిక ప్రకారం సోదాలు చేసుకున్నారని.. ఇందులో వాస్తవం లేదని బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహరావు పేర్కొన్నారు. సోదాలు టీడీపీ నేతల మీదనే ఎందుకు చేస్తున్నారని టీడీపీ నేతలు ప్రశ్నిస్తున్నారు. ఎస్పీకే తెలియకుండా ఎస్సై సోదాలు చేయడం వెనుక టీడీపీ రాజకీయం ఉందని దీనిపై ఈసీకి ఫిర్యాదు చేసేందుకు వైసీపీ సిద్దమైంది.