ఏపీ మాజీ మంత్రి భూమా అఖిల ప్రియ భర్త భార్గవ్ రామ్ గురించి తెలిసిందే. భార్యకున్న అధికారంతో చెలరేగిపోయే అతగాడు తాజాగా సంచలన నిర్ణయాన్ని తీసుకున్నట్లుగా చెబుతున్నారు. భార్యకున్న అధికారంతో చెలరేగిపోవటమే కాదు.. బిజినెస్ పార్టనర్ పై దాడి చేసిన ఉదంతంలో ఆళ్లగడ్డ పోలీసులు ఆయనపై కేసు నమోదు చేయటం తెలిసిందే.
కర్నూలు జిల్లా దొర్నిపాడు మండలం కొండాపురానికి చెందిన క్రషర్ బిజినెస్ లో శివరామిరెడ్డి.. అఖిలప్రియలు కలిసి చేస్తుంటారు. అయితే.. వ్యాపార లావాదేవీల్లో చోటుచేసుకున్న వివాదంలో అఖిలప్రియ భర్త భార్గవ్ రామ్ దాడికి పాల్పడినట్లుగా శివరామిరెడ్డి సతీమణి మాధవీలత ఆళ్లగడ్డ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు.
ఈ ఉదంతంలోభార్గవ్ రామ్ తో పాటు మరో పది మందిపైనా పోలీసులు కేసులు నమోదు చేశారు. తన భర్త మీద హత్యాయత్నం చేసినట్లుగా చేసిన కంప్లైంట్ నేపథ్యంలో భార్గవ్ రామ్ ను అదుపులోకి తీసుకునేందుకు పోలీసులు ప్రయత్నించారు. అయితే.. వారి నుంచి తప్పించుకున్న అతను హైదరాబాద్ కు వచ్చారు.
అతన్ని అదుపులోకి తీసుకునేందుకు హైదరాబాద్ కు వచ్చిన ఆళ్లగడ్డ పోలీసులు.. అతడ్ని అదుపులోకి తీసుకునే ప్రయత్నంలో తాను నడుపుతున్న వాహనాన్ని వేగంగా నడిపి తప్పించుకున్నారు. ఈ నేపథ్యంలో పోలీసులపై హత్యాయత్నం కేసు నమోదుతోపాటు.. విధుల్ని ఆటంకపరిచిన అంశంపైనా కేసు నమోదు చేసినట్లుగా తెలుస్తోంది.
ఇదిలా ఉంటే.. హైదరాబాద్ లో భార్గవ్ రామ్ ఆచూకీని పోలీసులు గుర్తించారు. ఆయన్ను అదుపులోకి తీసుకునే సమయంలో కారును పోలీసులపైకి వేగంగా దూసుకెళ్లేలా చేసి తప్పించుకున్నారు. ఈ ఘటనపై భార్గమ్ రామ్ మీద ఆళ్లగడ్డ పోలీసులు హైదరాబాద్ లో ఫిర్యాదు చేయటంతో కేసు నమోదు చేశారు. ఇలా ఒకటి తర్వాత ఒకటిగా తన మీద పెరుగుతున్న కేసుల నేపథ్యంలో భయంతో విదేశాలకు పారిపోయినట్లుగా చెబుతున్నారు.
ఆయన ఆచూకీ కోసం ప్రయత్నించిన కుటుంబ సభ్యులు భార్గవ్ రామ్ కు ఫోన్ చేస్తే తాను గ్రీస్ లో ఉన్నట్లు చెప్పి ఫోన్ పెట్టేసినట్లు చెబుతున్నారు. ఈ సమాచారంలో నిజం ఎంతన్నది ఇప్పుడు ప్రశ్నగా మారింది. ఒకపక్క భార్గవ్ రామ్ ఆచూకీ లభించని వేళ.. ఆయన విదేశాలకు వెళ్లే అవకాశం ఉందన్న మాట బలంగా వినిపిస్తోంది.అయినా తప్పులు చేయటం ఎందుకు? కేసుల భయంతో విదేశాలకు పారిపోవటం ఎందుకో?