టీడీపీ ఎమ్మెల్యేకు పోలీసుల షాక్‌

Update: 2015-09-19 05:32 GMT
ఏపీలో అధికార పార్టీ ఎమ్మెల్యే కు తీవ్ర అవ‌మానం ఎదురైంది. శ్రీకాకుళం జిల్లాకు చెందిన పార్టీ సీనియ‌ర్ నేత‌, ప‌లాస ఎమ్మెల్యే గౌతు శ్యాం సుంద‌ర్ శివాజీ శ‌నివారం విజ‌య‌వాడ‌లో చంద్ర‌బాబును క‌లిసేందుకు వ‌చ్చారు. ఏపీ కలెక్టర్ల సమావేశం జరుగుతున్న హోటల్‌ వద్ద ఆయ‌న్ను లోనికి వెళ్ల‌నీయ‌కుండా పోలీసులు అడ్డుకున్నారు. దీంతో ఎమ్మెల్యే పోలీసులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎమ్మెల్యేలు కూడా తెలియకుండా ఉద్యోగాలు ఎలా చేస్తున్నారని ఒక్క‌సారిగా ఫైర్ అయ్యారు.

 తాను ఆరుసార్లు ఎమ్మెల్యే గా గెలిచాన‌ని, త‌మ పార్టీ అధినేత‌ను కూడా క‌లిసే అవ‌కాశం ఇవ్వ‌రా అంటూ ఆగ్ర‌హంతో ఊగిపోయారు. అయితే అప్పుడే అటుగా వ‌చ్చిన మంత్రి కొల్లు ర‌వీంద్ర అక్క‌డ‌కు చేరుకుని ఆయ‌న‌కు స‌ర్దిచెప్పారు. దీంతో పోలీసులు ఆయ‌న్ను లోప‌ల‌కి అనుమ‌తించారు. కొద్ది రోజులుగా శ్రీకాకుళం జిల్లాలో మంత్రి అచ్చెన్న వైఖ‌రిపై విమ‌ర్శ‌లు గుప్పిస్తున్న శివాజీ ఆ విష‌యంపై చంద్ర‌బాబుకు ఫిర్యాదు చేసేందుకే ఇక్క‌డ‌కు వ‌చ్చిన‌ట్టు స‌మాచారం.
Tags:    

Similar News