జైల్ భరో లో పాల్గొన్న వారిపైనా ఆ కేసులు ఎందుకు పెట్టారు?

Update: 2020-11-03 07:10 GMT
ఇటీవల అమరావతి గ్రామాల్లో చోటు చేసుకున్న ఒక పరిణామంలో రైతుల చేతులకు బేడీలు వేసిన వైనం వివాదంగా మారటం..ఈ అంశాన్ని పలువురు తప్పు పట్టటం తెలిసిందే. బేడీలు వేసిన అధికారులపై ప్రభుత్వం చర్యలు తీసుకుంది. అయినప్పటికీ..రైతుల చేతికి బేడీలు వేస్తారా? అంటూ అందరిని ఆకర్షించే ప్రశ్నలు వేస్తూ.. రాష్ట్ర ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టేందుకు జైల్ భరో కార్యక్రమానికి పిలుపునిచ్చారు.

ఈ సందర్భంగా నిర్వహించిన నిరసన కార్యక్రమం కొత్త ఉద్రిక్తతకు దారి తీసినట్లుచెబుతున్నారు. పెద్ద ఎత్తున జైల్ భరోలో పాల్గొన్నారు. అంతేకాదు.. నిరసనలో భాగంగా జైల్లోకి దూసుకెళ్లే ప్రయత్నం చేసిన ఆందోళకారుల్ని చెదరగొట్టేందుకు పోలీసులు రంగంలోకి దిగారు. ఈ క్రమంలో చోటు చేసుకున్న పరిణామాలు హాట్ టాపిక్ గా మారాయి.

ఇదిలా ఉంటే.. తాజాగా నిర్వహించిన జైల్ భరోలో పాల్గొన్న ఆందోళనకారులపై భారీ ఎత్తున కేసులు నమోదు చేసినట్లు చెబుతున్నారు. తాజాగా కేసులు నమోదైన వారిలో అమరావతి రైతు ఐకాస ప్రతినిదులతో పాటు..దళిత రైతు ఐకాస.. ఇతర ఐకాస నేతలకు చెందిన వారు.. పలు ప్రజా సంఘాల నేతలు ఉన్నారు. జైల్ భరో నిర్వహించిన వారిలో 99 మందిపై నాన్ బెయిల్ బుల్ కేసులు నమోదు చేయటం గమనార్హం. మరో 23 మందిపై సీఆర్ పీసీ 151 కింద కేసులు నమోదు చేశారు. నాన్ బెయిలబుల్ కేసులు నమోదు చేయటానికి కారణం.. జైలు ఆవరణలోకి చొచ్చుకెళ్లేందుకు ప్రయత్నించటమేనని చెబుతున్నారు.

శైలజ అనే మహిళను ఈ ఉదంతంలో ఏ1గా పేర్కొన్నట్లుగా పోలీసులు చెబుతున్నారు. అమరావతికి చెందిన కొందరు రైతులపై ఎస్సీ.. ఎస్టీ అట్రాసిటీ కేసులు నమోదు చేసి.. వారి చేతులకు బేడీలు వేసిన వైనంపై ఆగ్రహం వ్యక్తం కాగా.. దానికి నిరసన చేపట్టిన వారిపై ఇంత భారీగా నాన్ బెయిల్ బుల్ కేసులు నమోదు చేయటం ఇప్పుడు కొత్త చర్చకు తెర తీసింది. ఇంత తీవ్రంగా కేసులునమోదు చేయటానికి కారణం ఏమిటన్న దానికి పోలీసులు ఏం చెబుతున్నారంటే.. ఆందోళనకు అనుమతి లేదని.. కోవిడ్ నిబంధనల్ని ఉల్లంఘించటం కూడా కారణమని చెబుతున్నారు.
Tags:    

Similar News