అంతర్వేదిలో ఉద్రిక్తత, ర్యాలీని అడ్డుకున్న పోలీసులు .. మంత్రులను నిలదీసిన హిందూ సంఘాలు

Update: 2020-09-08 13:30 GMT
తూర్పుగోదావరి జిల్లా అంతర్వేదిలో లక్ష్మీనరసింహ స్వామి రథం దగ్ధమైన విషయంపై హందూ సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ఈ ఘటనలో స్వామివారి రథం మంటల్లో దగ్ధమైంది. ఉద్దేశపూర్వకంగానే ఎవరో ఈ పని చేశారని హిందుత్వ సంఘాలు ఆరోపిస్తున్నాయి. అటు ప్రభుత్వం కూడా ఈ ఘటనను సీరియస్‌ గా తీసుకోని, జరిగింది ప్రమాదమా లేక అందులో ఏదైనా కుట్రకోణం ఉందా అని తేల్చేందుకు ఓ కమిటీని కూడా వేసింది. ఇకపోతే , ఈ ఘటనతో అంతర్వేది లో తీవ్ర ఉద్రికత్త పరిస్థితులు ఏర్పడ్డాయి.

లక్ష్మీ నరసింహస్వామి దేవాలయానికి ర్యాలీగా వెళ్తున్న ధార్మిక సంఘాల నేతలు, భక్తులను పోలీసులు అడ్డుకున్నారు. దిండి బ్రిడ్జిపై పోలీసులు ర్యాలీని అడ్డుకొని , ఈ ర్యాలీకి ఎలాంటి అనుమతులు లేవని వెంటనే వెనక్కి తిరిగి వెళ్లిపోవాలని తెలిపారు. అయితే, శాంతియుతంగా ఆలయానికి వెళ్తుంటే ఎందుకు అడ్డుకుంటున్నారని ధార్మిక సంఘాల నేతలు పోలీసులతో వాగ్వాదానికి దిగారు. జైశ్రీరాం‌ అంటూ నినాదాలు చేశారు. ఎక్కువ మంది ఒకేసారి ర్యాలీగా రావడంతో అక్కడ ఉద్రిక్తత పరిస్థితులు ఏర్పడ్డాయి.

ఈ ఘటనపై ఏపి మంత్రులు అంతర్వేదిలో పర్యటించారు. దీంతో ప్రముఖ హిందూ సంఘాలు వీహెచ్ పీ, భజరంగ్ దళ్ తమ ఆగ్రహాన్ని రుచిచూపాయి. అంతర్వేది వచ్చిన మంత్రులు వెల్లంపల్లి శ్రీనివాసరావు, పినిపె విశ్వరూప్ తదితరులను వీహెచ్ పీ, భజరంగ్ దళ్ నిలదీశాయి. ఈ సందర్భంగా ఏపీ మంత్రులు ఈ నెల 15 లోపు పకడ్బందీ విచారణ జరిపి దోషులను పట్టుకుంటామని హామీ ఇచ్చే ప్రయత్నం చేశారు. దీనికి హిందూ సంఘాలు బదులిస్తూ, ఈ నెల 15 లోపు బాధ్యులను పట్టుకోకపోతే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరించాయి.
Tags:    

Similar News