నయీం అనే ఒక ముఠానాయకుడు - రౌడీ - హంతకుడు మరియు మాఫియా డాన్ ఎన్ కౌంటర్ లో మరణించిన వెంటనే.. సాధారణంగా.. అతని బెదిరింపులు - వేధింపులకు గురైన వారిలో ఆనందాలు ఉంటాయి. కానీ తెలంగాణలో అంతకు మించి.. చాలా మంది పెద్దలు భుజాలు తడుముకుంటున్నారు. రాజకీయ - పోలీసు వర్గాల దన్నుతోనే నయీం ఇన్నాళ్లుగా మాఫియా డాన్ గా చెలామణీ అవుతూ ఉన్నాడనేది అందరికీ తెలిసిన సంగతే. ఇప్పుడూ వారే అలర్ట్ అవుతున్నారు.
అయితే నయీం ఎటూ ఇప్పుడు మరణించాడు గనుక.. ఆ ఫ్యాక్టర్ ను అడ్డు పెట్టుకుని.. ఇప్పుడు ఎవరి ప్రయోజనాలు వారు చక్కబెట్టుకోవడానికి రాజకీయ నాయకులు ప్రయత్నిస్తూ ఉండడం విశేషం. నల్గొండ జిల్లాకే చెందిన కోమటిరెడ్డి రాజగోపాల్.. తాను ఎమ్మెల్సీగా నిలబడినప్పుడే నయీం తనను బెదిరించాడని, తాను భయకుండా పోటీచేసి గెలిచానని కొన్ని రోజులుగా పదేపదే ప్రచారం చేసుకుంటున్నారు. తెరాస నాయకులు అందరితోనూ నయీంకు సంబంధాలు ఉన్నాయంటూ.. అందరి దృష్టిని అటువైపు మళ్లించే ప్రయత్నం చేస్తున్నారు.
నిజం చెప్పాలంటే... నయీంతో సంబంధాలను రాజకీయకోణంలో చూడడం కరెక్టు కాదనే వాదన బలంగా వినిపిస్తోంది. ఎందుకంటే.. రాజకీయ పార్టీలతో నిమిత్తం లేకుండా.. నేరగాళ్లతో తమ పనులు చక్కబెట్టుకోవాలని భావించే వక్రబుద్ధులు ఉండే వాళ్లంతా నయీంను మొన్నటిదాకా నెత్తిన పెట్టుకున్న వాళ్లే. ఇవాళ నయీంతో తెరాసకు సంబంధాలు ఉన్నాయంటూ.. కోమటిరెడ్డి అంటుండవచ్చు గాక.. కానీ.. తెరాస ప్రభుత్వం వచ్చి రెండేళ్ల అయిందని మరచిపోకూడదు. గత పదేళ్లుగా కాంగ్రెసు ఏలుబడే సాగుతోంది. ఇన్నాళ్లలో నయీంను పెంచి పోషించిన పెద్దలు ఆ ప్రభుత్వంతో సంబంధం లేకుండానే ఉంటారా? అనేది ప్రశ్న. ఆ మాటకొస్తే అదే జిల్లాలో నయీంను తమ అవసరాలకు వాడుకున్న తెలుగుదేశం వారు కూడా ఉన్నారనే ప్రచారమూ ఉంది.
నయీం యవ్వారాన్ని కూడా రాజకీయం చేసే పరిస్థితి కాకుండా.. నేరగాళ్లతో సంబంధాలు ఉన్న అందరినీ జనం ముందు దోషులుగా నిలబెట్టాల్సిన అవసరం ఉంది. అయితే ఈ విషయం ముందుముందు ఇంకా అనేక మలుపులు తిరుగుతుందని, చాలా పెద్ద చేపల మీద అనుమానాలు - అనుబంధాల బురద తప్పకపోవచ్చునని అందరూ వ్యాఖ్యానిస్తున్నారు.