రాహుకాలంలో షెడ్యూల్.. రాజకీయ నేతల్లో టెన్షన్!

Update: 2019-03-11 08:46 GMT
రాజకీయాల్లో గ్రహబలాలకు - ముహూర్తాలకు రాజకీయ నేతలు చాలా ప్రాధాన్యతను ఇస్తారనేది అందరికీ తెలిసిందే. ప్రత్యేకించి ఈ మధ్య కాలంలో ఇది బాగా పెరిగింది. పదేళ్ల కిందట కూడా రాజకీయ నేతలు వీటిని పెద్దగా పట్టించుకునే వాళ్లు కాదు. అయితే ఇప్పుడు లీడ్ లో ఉన్న నేతలకు ఈ పట్టింపులు  ఎక్కువగానే కనిపిస్తున్నాయి.

ప్రత్యేకించి దక్షిణాది నేతల్లో ఈ నమ్మకాల గురించి వివరించనక్కర్లేదు. తెలంగాణ సీఎం కేసీఆర్, కర్ణాటక సీఎం కుమారస్వామి, కర్ణాటక ప్రతిపక్ష నేత యడ్యూరప్పలకు ఈ నమ్మకాలు ఎక్కువ. చంద్రబాబు నాయుడుకు కూడా ఈ నమ్మకాలు బాగా పెరిగాయని ఈ మధ్య ఆయన తీరును గమనించిన వారు అంటున్నారు.

ఇలాంటి నేతలందరికీ ఇప్పుడు ఎన్నికల కమిషన్ కొంత టెన్షన్ పెట్టింది. అదెలాగంటే.. రాహు కాలంలో ఎన్నికల షెడ్యూల్ ను విడుదల చేసి! ఆదివారం సాయత్రం నాలుగున్నర నుంచి ఆరు గంటల మధ్యన ఎన్నికల షెడ్యూల్ విడుదల అయిన సంగతి తెలిసిందే. క్యాలెండర్ లో టైమ్ గురించి చూస్తే.. అది వర్జ్యమని తెలుస్తోంది! సాధారణంగా వర్జ్య కాలాన్ని సానుకూలంగా తీసుకోరు నమ్మకాలు కలిగి ఉండే వాళ్లు.

అలాంటి నేతలకు ఇప్పుడు  టెన్షన్ మొదలైందని టాక్. వర్జ్యంలో షెడ్యూల్ విడుదల అయిన నేపథ్యంలో.. దోష నివారణకు తామేం చేయాలో చెప్పాలని సదరు నేతలు పండితులను సంప్రదిస్తున్నట్టుగా ప్రచారం జరుగుతూ ఉంది! ఈ విషయాల్లో సదరు నేతలు తమ ఆస్థాన పండితులు - సిద్ధాంతిలతో సంప్రదిస్తూ.. నివారణ చర్యల గురించి సలహాలు  కోరుతున్నారట!
Tags:    

Similar News