అధికార తెలంగాణ రాష్ట్ర సమితి కావచ్చు.. టీడీపీ - బీజేపీ కూటమి కావచ్చు. ఏ పార్టీకి అయినా గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్లో సొంతంగా జెండా ఎగరేసే అవకాశాలు లేనే లేవు. ఏ పార్టీకి అయినా మజ్లిస్ పొత్తుతోనే అధికారం దక్కే అవకాశాలు ఉన్నాయి. సంకీర్ణ ప్రభుత్వం కాకపోతే జీహెచ్ ఎంసీలో పాలక మండలే ఏర్పడే అవకాశాలు కనిపించడం లేదు.
జీహెచ్ఎంసీ పరిధిలో మొత్తం డివిజన్లు 150 ఉన్నాయి. దీని ప్రకారం 76 డివిజన్లలో గెలిచిన పార్టీ అధికార పగ్గాలు దక్కించుకుంటుంది. అయితే, కథ ఇక్కడితోనే అయిపోలేదు. జీహెచ్ ఎంసీలో ఎక్స్ అఫీషియో సభ్యులు కూడా ఉన్నారు. వారికి కూడా మేయర్ ను నిర్ణయించే ఓటు హక్కు ఉంది. ఎక్స్ అఫీషియో సభ్యులు మరో 55 మంది ఉండడంతో మొత్తం ఓట్ల సంఖ్య 205కు పెరిగింది. దాంతో మేజిక్ మార్కు 103 అవుతుంది. ఇక, గ్రేటర్ పరిధిలో టీఆర్ఎస్ కు 24 మంది ఎక్స్ అఫీషియో సభ్యులు ఉన్నారు. దాని ప్రకారం ఆ పార్టీ 79 డివిజన్లలో విజయం సాధించాల్సి ఉంటుంది. అయితే, ప్రస్తుత పరిస్థితుల్లో ఆ అవకాశాలు కనిపించడం లేదు. టీఆర్ఎస్ అంతర్గత సర్వేలో కూడా 40 వరకూ డివిజన్లు వస్తాయని తేలినట్లు తెలుస్తోంది. ఒకవేళ ఆ పార్టీకి 50 డివిజన్లు వస్తాయని భావించినా.. ఇంకా 30 డివిజన్లు కావాల్సి ఉంటుంది. ఆ పరిస్థితుల్లో మజ్లిస్ తో పొత్తు తప్పనిసరి అవుతుంది.
ఇక టీడీపీ బీజేపీ కూటమికి ఇప్పటికే 14 ఓట్లు ఉన్నాయి. గ్రేటర్ పీఠాన్ని దక్కించుకోవాలంటే ఆ కూటమికి ఇంకా 89 డివిజన్లు అవసరం. సెటిలర్లతోపాటు తెలంగాణలోని మిగిలిన వర్గాల్లో కూడా టీఆర్ఎస్ మీద తీవ్రస్థాయిలో వ్యతిరేకత వెల్లువెత్తితే తప్ప టీడీపీ, బీజేపీ కూటమి ఇన్ని స్థానాలను గెలుచుకోవడం దాదాపు అసాధ్యమని విశ్లేషకులు వివరిస్తున్నారు. మొన్నటి సార్వత్రిక ఎన్నికల తరహాలో సెటిటర్లు, తెలంగాణలోని కొంతమంది కూడా ఈ కూటమికి మద్దతు ఇస్తేనే ఇది సాధ్యమవుతుంది. ఇక, మజ్లిస్ సొంతంగా అధికారం దక్కించుకునే ప్రసక్తే గ్రేటర్లో లేదు. కాంగ్రెస్ ది కూడా ఇదే పరిస్థితి. గ్రేటర్ పీఠంపై కాంగ్రెస్ జెండా కప్పాలంటే ఆ పార్టీ వంద వరకూ డివిజన్లను గెలుచుకోవాల్సి ఉంటుంది. అది అసాధ్యమేనని ఘంటాపథంగా చెప్పవచ్చు.