వారిని కండోమ్స్ లా వాడేస్తున్నారట

Update: 2017-01-27 05:43 GMT
ఇప్పుడున్న రాజకీయాల్లో ఎవరి నోటి నుంచైనా.. ఎలాంటి మాట అయినా వచ్చేసే పరిస్థితి. రాజకీయంగా లబ్థి చేకూరుతుందన్న భావన ఉంటే చాలు.. తమను తాము కించపర్చుకోవటమే కాదు.. అందరిని కించపరిచేలా మాట్లాడేందుకు సైతం వెనుకాడటం లేదు. తాముచేసే వ్యాఖ్యలు వివాదాస్పదమవుతాయని.. పలువురు మనసులు నొచ్చుకుంటాయన్న విషయాన్ని వారు లైట్ తీసుకుంటున్నారు.

కావాల్సింది రాజకీయ ప్రయోజనమే అయినప్పడు ఇలాంటివేమీ పట్టించుకోకూడదని అనుకుంటున్నారేమో కానీ.. ఇష్టారాజ్యంగా మాట్లాడటం ఈ మధ్యన ఎక్కువైంది. తాజాగా ఈ తరహాలోనే విపరీత వ్యాఖ్యల్ని చేశారు యూపీ అధికారపక్ష యువనేత.. మహారాష్ట్ర పార్టీ అధ్యక్షులుగా వ్యవహరిస్తున్న అబూ ఆజ్మీ కుమారుడు ఫర్హాన్ ఆజ్మీ. ముస్లింల గురించి వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన ఆయన తీరు చూస్తే.. ఎన్నికల్లో రాజకీయ లబ్థిని చేకూర్చటమే తప్పించి మరొకటి కాదన్నట్లుగా ఉంది.

పలు రాజకీయ పార్టీలు ముస్లింలను కండోమ్స్ లా వాడుకుంటున్నాయంటూ తీవ్రమైన వ్యాఖ్యను చేయటం గమనార్హం. ముంబయిలో జరగనున్న బీఎంసీ ఎన్నికల ప్రచార సభకు హాజరైన అతగాడు ఇష్టారాజ్యంగా మాట్లాడేశారు. ముస్లింలను రెచ్చగొట్టటం.. రాజకీయ ప్రయోజనం పొందటమే లక్ష్యంగాఅతగాడి వ్యాఖ్యలు ఉండటం గమనార్హం. ఫర్హాన్ ఆజ్మీ వ్యాఖ్యలపై బీజేపీ నేతలు తీవ్రంగా రియాక్ట్ అయ్యారు. తన వ్యాఖ్యలతో మొత్తం ముస్లిం జాతిని అవమానించినట్లుగా మండిపడుతున్నారు. తాను చేసిన వ్యాఖ్యలపై రాజకీయ పార్టీలు స్పందిస్తున్న తీరుపై మాట్లాడుతూ.. ముస్లింల దురవస్థను చెప్పేందుకే తాను అలాంటి వ్యాఖ్యలు చేశానేతప్పించి.. ముస్లింలను తక్కువ చేయటం తన ఉద్దేశం కాదంటూ సమర్థించుకునే ప్రయత్నం చేశారు. నిజమే.. రాజకీయ ప్రయోజనం తప్పించి.. మరెలాంటి ఉద్దేశాలు ఇలాంటి వివాదాస్పద వ్యాఖ్యల వెనుక ఉండవు కదా?

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News