దేశం యావత్తు ఆసక్తిగా చూస్తున్న మరో రాష్ట్ర ఎన్నికలుగా గుజరాత్ ను చూడాలి. ముఖ్యమంత్రిగా మోడీ వేసిన పునాదితో బీజేపీ ఆ రాష్ట్రంలో ఎంత బలంగా వేళ్లూరుకుందన్న విషయం తెలిసిందే. గతంలో గుజరాత్ మోడల్ చూడమన్న మాట వినిపించేది. అలాంటిది ఇప్పుడు అందుకు భిన్నమైన పరిస్థితులు. గుజరాత్ కు మించిన డెవలప్ మెంట్ తో కొన్ని రాష్ట్రాలు దూసుకెళుతున్న వేళ.. బీజేపీకి ఎలాంటి ఫలితం రానుందన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఇప్పటికి ఆరుసార్లు వరుస పెట్టి అధికారంలోకి వచ్చిన బీజేపీ.. ఏడోసారి కూడా గెలిచి.. తమకు తిరుగులేదన్న సంకేతాన్ని ఇవ్వాలని భావిస్తున్నాయి. ఇందుకోసం దేనికైనా రెఢీ అన్నట్లుగా వ్యవహరిస్తోంది. గెలుపు కోసం కాంగ్రెస్.. ఆమ్ ఆద్మీ పార్టీలు సైతం ఉన్న అన్ని మార్గాల్ని వెతుకుతోంది.
ఇలాంటి వేళలోనే గుజరాత్ రాష్ట్ర మొదటి దశ పోలింగ్ గురువారం జరిగింది. అరవై శాతం ఓటర్లు మాత్రమే తమ ఓటుహక్కును వినియోగించుకున్నారని చెబుతున్నారు. కడపటి వార్తలు అందేసరికి.. మొదటి దశలో అరవై శాతం ఓట్లు మోదు కావటం తెలిసిందే.
మరో శాతం పెరిగే వీలుందన్న మాట వినిపిస్తోంది. ఇక.. రెండో విడత పోలింగ్ సోమవారం (డిసెంబరు 5న) జరుగుతుండగా.. డిసెంబరు 8న అంటే గురువారం ఎన్నికల ఫలితాలు వెల్లడి కానున్నాయి. ప్రధాని నరేంద్ర మోడీ ఇమేజ్ ఎలా ఉందన్న విషయాన్ని తేల్చేసే గుజరాత్ రాష్ట్ర ఎన్నికల ఫలితాల ప్రభావం దేశ రాజకీయాల మీద ఉంటుందని మాత్రం చెప్పక తప్పదు.
ఇలాంటి వేళ.. గుజరాత్ పీఠాన్ని దక్కించుకోవటం తీవ్రంగా శ్రమిస్తున్న మూడు రాజకీయ పార్టీలు బీజేపీ.. కాంగ్రెస్.. ఆమ్ ఆద్మీ పార్టీలు తమ ఎన్నికల ప్రణాళికలో ఎలాంటి హామీలు ఇచ్చాయి? ఎవరివి ఆకర్షణీయంగా ఉన్నాయన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. మరోసారి అధికారంలోకి రావటం ద్వారా గుజరాత్ తమకు కంచుకోట అన్న విషయాన్ని బీజేపీ స్పష్టం చేయాలని భావిస్తుంటే.. ఈసారైనా విజయాన్ని సొంతం చేసుకోవాలని కాంగ్రెస్ తపిస్తోంది.
ఇక.. పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల్లో అనూహ్య విజయాన్ని సాధించటం ద్వారా.. తనను తక్కువ అంచనా వేయటానికి వీల్లేదన్న రీతిలో ఆమ్ ఆద్మీ పార్టీగా మారింది. అయితే.. గుజరాత్ లో ఆ పార్టీ పప్పులు ఉడకవని చెబుతున్నా.. తుది ఫలితం ఎలా ఉంటుందన్న విషయంపై ఆసక్తి వ్యక్తమవుతోంది. దీనికి సంబంధించిన వివరాలు మరో వారంలో తేలిపోనున్నాయి.
అసెంబ్లీ ఎన్నికల్లో కీలకమైన పోలింగ్ సాగుతున్న వేళ.. ఏ పార్టీ ఎలాంటి హామీల్ని ఇచ్చింది? ఎవరివి ఆసక్తికర హామీలన్న విషయాన్ని చూస్తే..
బీజేపీ
- యూనిఫాం సివిల్ కోడ్ అమలు
- ఈ అంశంపై అధ్యయనానికి కేబేనెట్ కమిటీ ఏర్పాటు
- గుజరాత్ యువతకు 20 లక్షల ఉద్యోగాలు
- ప్రభుత్వ పాఠశాలల ఆధునీకీకరణ
- గుజరాత్ ఆర్థిక వ్యవస్థ ట్రిలియన్ డాలర్ ఎకానమిగా మార్చేందుకు వ్యూహాలు
- తీవ్రవాదాన్ని.. ఉగ్రవాద భావజాలలాన్ని నిర్మూలించేందుకు ర్యాడికల్ సెల్ ఏర్పాటు
కాంగ్రెస్
- మోడీ పేరుతో నిర్మించిన స్టేడియం పేరును మారుస్తాం
- స్టేడియానికి సర్దార్ పటేల్ పేరు పెట్టటం
- రూ.3 లక్షల వరకు రైతు రుణ మాఫీ
- 300 యూనిట్ల మేర ఉచిత విద్యుత్తు
- 10 లక్షల ఉద్యోగాలు.. యువతకు 3 వేల నిరుద్యోగ భ్రతి
- ప్రభుత్వ ఉద్యోగాల్లో మహిళకు 50 శాతం.. రిజర్వేషన్
- కేజీ నుంచి పీజీ వరకు ఉచిత విద్య
- గుజరాత్ వ్యాప్తంగా 3 వేల ఇంగ్లీష్ మీడియాం స్కూళ్లు
- పాత పెన్షన్ విధానం అమలు
ఆద్ ఆద్మీ
- తమ పార్టీ సీఎం అభ్యర్థిగా సామాన్యుడిగా ఎంట్రీ ఇచ్చి టీవీ స్టార్ అయిన ఈసుదాస్ గఢ్వీ
- 300 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్
- ఉచిత విద్య అందరికి అందుబాటులోకి?
- ఉచిత విద్యతో పాటు వైద్యాన్ని కూడా ఉచితంగా అందిస్తాం.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.