డిసెంబరులో జరిగే గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం తథ్యమని ఆ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ జోస్యం చెప్పారు. కాంగ్రెస్ సునామీలో పాలక బీజేపీ కొట్టుకుపోవడం ఖాయమని అన్నారు. కాంగ్రెస్-బీజేపీ మధ్య పోటీని సత్యం-అసత్యాల మధ్య పోరుగా అభివర్ణించారు. కేంద్ర - రాష్ట్ర ప్రభుత్వాల వైఫల్యాలనే తాము ఎండగడుతున్నామని.. వ్యక్తిగత విమర్శలకు దిగబోమని స్పష్టంచేశారు. ప్రధానమంత్రి తమను లక్ష్యంగా చేసుకుని ఎన్నో విమర్శలు చేశారని - కానీ తాము మాత్రం ఆయనలా నోరు జారబోమని.. ప్రధాని పీఠానికి గౌరవం ఇస్తామని రాహుల్ వెల్లడించారు.
గుజరాత్ ఎన్నికల ప్రచారంలో మూడోరోజు ఆయన బనస్కాంత జిల్లా థారాలో జరిగిన ర్యాలీలో రాహుల్ పాల్గొన్నారు. ప్రభుత్వ వైఫల్యాలపై ఆగ్రహాన్ని ఓట్ట రూపంలో చూపాలని ప్రజలను కోరారు. గుజరాత్ లో ఎన్నికల ప్రచారానికి ప్రధాని నరేంద్రమోదీ - బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా - ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ వచ్చారని.. అయినా బీజేపీ మాత్రం అధికారంలోకి రాదని చమత్కరించారు. 22 ఏళ్లుగా రాష్ట్రంలో బీజేపీ అధికారంలో ఉందని చెప్పిన రాహుల్.. జీఎస్టీ - నోట్ల రద్దు తదితర నిర్ణయాలపై మీ అభిప్రాయాన్ని పోలింగ్ కేంద్రాల్లో ఓట్ల రూపంలో వెల్లడించాలని ప్రజలకు పిలుపునిచ్చారు. మార్పు కోసం బీజేపీని నర్మదా ఆనకట్టలో కలిపేయాలని సూచించారు.
ప్రచారంలో భాగంగా గుజరాత్ లోని వ్యవసాయ రంగాన్ని కాంగ్రెస్ యువరాజు ప్రస్తావించారు. అన్నదాతలు తమ రక్తాన్ని చమట రూపంలో చిందించి దేశానికి ఆహారం అందిస్తున్నారని చెప్పారు. అయితే పెద్దపెద్ద కంపెనీలకు లబ్ధి చేకూర్చిన ప్రభుత్వాలు రైతులను ఆదుకోవడంలో ఎందుకు విఫలమయ్యాయని రాహుల్ ప్రశ్నించారు. గత శనివారం నుంచి ఉత్తర గుజరాత్‌లో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న రాహుల్ దూకుడుగా దూసుకెళ్తున్నారు. జీఎస్టీ - నోట్ల రద్దు నిర్ణయాలపై ప్రజల్లో నెలకొన్న ఆగ్రహాన్ని తమకు అనుకూలంగా మార్చుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. అయితే ఈ దిశగా కాంగ్రెస్ ఏ మేరకు సఫలమవుతుందో తెలియాలంటే డిసెంబరు వరకూ వేచిచూడాల్సిందే.