అయోధ్య తీర్పు పై స్పందించిన రాజకీయ , సినీ ప్రముఖులు..!

Update: 2019-11-09 09:07 GMT
అయోధ్య వివాదాస్పద స్థలంపై సుప్రీంకోర్టు కీలక తీర్పుఇచ్చింది. అయోధ్యలో వివాదాస్పద స్థలం హిందువులదేనని సుప్రీంకోర్టు తుది తీర్పును వెల్లడించింది. ఈ నేపథ్యంలో దీనిపై పలువురు ప్రముఖులు స్పందించారు.

కేంద్ర మంత్రి రాజ్ నాథ్ సింగ్ : దేశంలోని ప్రతి ఒక్కరు ఈ తీర్పును సమదృష్టితో చూడాలని తాను కోరుతున్నట్లు తెలిపారు. ఓ మైలురాయి వంటి ఈ తీర్పు వెల్లడైన నేపథ్యంలో ప్రజలంతా శాంతి, సంయమనంతో ఉండాలని కోరుతున్నట్లు తెలిపారు.

ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ :'ఈ తీర్పును అందరూ స్వాగతించాలి.. ఇలా చేస్తేనే దేశంలో సామాజిక సామరస్యం వర్థిల్లుతుంది. ఈ విషయంపై మరో వివాదం ఉండరాదని నేను ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నాను అని తెలిపారు.

ఏపీ సీఎం జగన్ : అయోధ్యలో నిర్మాణంపై తీర్పునకు కట్టుబడి ఉంటామని ఇరుపక్షాలూ సుప్రీంకోర్టుకు తెలియజేసినమీదటే ఈ విషయంలో భారతదేశ అత్యున్నత న్యాయస్థానం తీర్పు వెలువడింది. ఇటువంటి పరిస్థితుల్లో మతసామరస్యానికి భంగం కలిగించేలా, రెచ్చగొట్టేలా ఎలాంటి వ్యాఖ్యలు చేయరాదు అని తెలిపాడు.

ప్రధాని మోడీ : ఈ నిర్ణయాన్ని ఎవరి విజయం లేదా ఓటమిగా చూడకూడదు. ఇది రామభక్తి అయినా, రహీమ్ భక్తి అయినా.. మనమంతా దేశ భక్తి అనే స్ఫూర్తిని బలోపేతం చేసే సమయం ఇది. శాంతి, సామరస్యం , ఐక్యతను కాపాడుకోవాలని దేశవాసులకు నా విజ్ఞప్తి అంటూ తెలియజేసారు.

ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ : సుప్రీం ఇచ్చిన తీర్పు విజయం లేదా ఓటమిగా చూడవద్దన్నారు. కోర్టు అందరికీ ఆమోదయోగ్యమైన తీర్పు ఇచ్చిందన్నారు.సుప్రీం తీర్పును ప్రతీ ఒక్కరూ గౌరవించాలని అన్నారు. దశాబ్దాలుగా సాగుతున్న ఈ వివాదం ఒక కొలిక్కి రావడం మంచి పరిణామంగా భావిస్తున్నట్టు చెప్పారు.

అమిత్ షా : దశాబ్ధాల నుంచి నానుతున్న రామ్ జన్మభూమి చట్టపరమైన వివాదంపై ఈ నిర్ణయంతో తుది రూపు వచ్చిందన్నారు. భారతదేశ న్యాయ వ్యవస్థను, న్యాయమూర్తులందరినీ అభినందిస్తున్నానని షా ట్వీట్ చేశారు.

కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ ; అయోధ్య కేసులో సుప్రీంకోర్టు తీర్పును తాను స్వాగతిస్తున్నానన్నారు కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ. ప్రతీ ఒక్కరూ సుప్రీంకోర్టు తీర్పును స్వాగతించాలనీ, శాంతియుతంగా ఉండాలని ఆయన కోరుకున్నారు.

ప్రియాంక వాద్రా : అయోధ్య సమస్యపై భారత సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది. ఈ నిర్ణయాన్ని గౌరవిస్తూ, అన్ని పక్షాలు, సంఘాలు మరియు పౌరులు శతాబ్దాల నాటి సమాజ సంస్కృతిని కొనసాగించాలి. మనమందరం కలిసి పరస్పర సామరస్యాన్ని, సోదరత్వాన్ని బలోపేతం చేసుకోవాలి ని తెలిపింది.

బాబా రాందేవ్‌ : అయోధ్య కేసులో సుప్రీం తీర్పు చారిత్రాత్మకమని యోగా గురు బాబా రాందేవ్‌ వ్యాఖ్యానించారు. మతాలు వేరైనా మనమంతా రాముడి వారసులమేనని అన్నారు. సుప్రీం తీర్పుతో అయోధ్య వివాదాలన్నీపరిష్కారమైనట్టేనని చెప్పారు.

మంచు లక్ష్మి : మన దేశంలో శాంతి, గౌరవం మరింత వ్యాప్తిచెందాలి. భారతదేశాన్ని ఇతర దేశాల కంటే చాలా అందంగా తీర్చిదిద్దేది మన దేశ వైవిధ్యం మరియు సమగ్రత అంటూ ట్వీట్ చేసింది. 
Tags:    

Similar News