''ఔను! అనుకున్నంత ఈజీ అయితే.. కాదు. కానీ, గెలిచి తీరాలి''-ఇదీ.. ఇప్పుడు మునుగోడు బరిలో .. అ న్ని రాజకీయ పార్టీలనూ.. వేధిస్తున్నసమస్య. ఇంటికో పువ్వు.. ఈశ్వరుడికో మాల అన్న చందంగా.. ఇక్క డ సమస్యలు కూడా.. అలానే తాండవిస్తున్నాయి. మండలానికో సమస్య.. ఇలానే తాండవం చేస్తోంది. ఎక్కడికక్కడ.. ప్రజలు అనేక సమస్యలు తెరమీదికి తెస్తున్నారు. దీంతో వారికి సర్దిచెప్పడం.. వారిని సముదాయించడం.. వంటివి ఇబ్బందిగానే మారనుంది.
బీజేపీ: ఇక్కడ గెలిచి తీరాలని లెక్కలు వేసుకుంటున్న బీజేపీకి ప్రజల నుంచి అనూహ్యమైన ప్రశ్నలు తెరమీదికి వస్తున్నాయి. తమకు ఏం చేశారని.. ఇన్నాళ్లుగా..లేని పార్టీ.. ఇన్నాళ్లు నియోజకవర్గంలోనే లేని జెండా.. ఇప్పుడు తమకు ఎదురొస్తుంటే.. ఇక్కడి ఓటర్లు ఆశ్చర్యంతో చూస్తున్నారు. సిట్టింగ్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి అనుచరులు.. మద్దతు దారులు తప్ప.. ఎవరూ కూడా.. బీజేపీ మొహం ఇప్పటి వరకు నియోజకవర్గంలో చూడనేలేదు. దీంతో ఇప్పుడు.. బీజేపీకి అస్తిత్వాన్ని కాపాడుకోవడమే పెద్ద సమస్యగా మారింది. దాని నుంచి ఓట్లు రాబట్టు కోవడం మరో సమస్యగా ఉంది.
కాంగ్రెస్: గతంలో వరుస విజయాలు దక్కించుకున్న ఈ పార్టీ.. రాష్ట్ర విభజన తర్వాత.. గత ఎన్నికల్లో విజయం దక్కించుకుంది. అయితే.. పార్టీ తరఫున గెలిచిన కోమటిరెడ్డి.. పార్టీతో విభేదించి.. నియోజక వర్గాన్ని వదిలేశారనే వాదన బలంగా వినిపిస్తోంది.
దీనిని వ్యక్తికి పులిమి.. తమ తప్పులేదని..కాంగ్రెస్ చెప్పుకొనే ప్రయత్నం చేస్తోంది. అయితే.. దీనిని ఎంత వరకు ప్రజలు విశ్వసిస్తారనేది ప్రశ్న. మరోవైపు.. మహిళా సెంటిమెంటు కోసం.. స్రవంతి రెడ్డిని రంగంలోకి దింపినా.. ఆమె ఏమేరకు మహిళల మనసు దోచుకుంటారనేది కూడా ప్రశ్నార్థకమే!..
టీఆర్ ఎస్: అధికారంలో ఉన్న పార్టీకి మునుగోడు గెలుపు అత్యంత అవస్యం. అయితే.. ఏ మాటకు ఆ మాట చెప్పాల్సి వస్తే.. గత మూడేళ్లుగా.. మునుగోడును పట్టించుకున్న పాపాన పోలేదు టీఆర్ ఎస్ అని.. ఇక్కడి ప్రజలే చెబుతున్నారు. దీనికి కారణం.. తమను(టీఆర్ ఎస్) నిత్యం విమర్శించి.. సవాళ్లు రువ్వే.. కోమటి రెడ్డి ఉండడమే కారణమని.. అంటున్నారు.
ఈ నేపథ్యంలో ఇప్పుడు వెళ్లి.. ఎన్ని చెప్పినా.. ఇప్పటి వరకు.. తమను ఎందుకు పట్టించుకోలేదన్న ప్రజల ప్రశ్నకు టీఆర్ ఎస్ సమాధానం చెప్పి రంగంలోకి దిగాలి. ప్రజలను తమవైపు తిప్పుకొనే ప్రయత్నం అయినా.. చేయాలి. లేకుండా... కేవలం ప్రచార ఆర్భాటానికే పరిమితం అయితే.. కష్టమని అంటున్నారు పరిశీలకులు. ఇలా.. కీలకమైన మూడు పార్టీలకు.. మునుగోడు అంత ఈజీకాదని.. ఎవరు గెలిచినా.. గెలవాలన్నా.. చమటోడ్చక తప్పదని అంటున్నారు పరిశీలకులు.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.