రాజకీయాలంటేనే ఎత్తులు.. పైఎత్తులు.. ఆరోపణలు.. ప్రత్యారోపణలు.. వ్యూహాలు.. ప్రతివ్యూహాలు.. ఇటీవలి సంవత్సరాల్లో రాజకీయాలు మరీ వ్యక్తిగత విమర్శల స్థాయికి పడిపోయిన సంగతి వేరే విషయం. అయితే, ప్రజలకు నేరుగా మేలు చేయాలనుకునేవారికి రాజకీయాలు ఒక మార్గం. సివిల్ సర్వీసుల తర్వాత అత్యంత ప్రభావితం చేయగల రంగం రాజకీయాలు. అయితే, ఇందులో ఎన్నో ఎత్తుపల్లాలు. కుట్రలు-కుతంత్రాలను ఛేదించుకుని ముందుకెళ్లడం అంత సులువు కాదు. భవిష్యత్ ను అంచనా వేసుకుంటూ.. అవకాశాలను అందిపుచ్చుకోవాల్సి
ఉంటుంది. అంతెందుకు..? కొన్ని దశాబ్దాల పాటు రాజకీయాల్లో ఉన్నప్పటికీ కనీసం సర్పంచ్ కాలేకపోయినవారు ఎందరో..?
మాటే మంత్రదండం రాజకీయాల్లో అనర్గళ ప్రసంగాలతో ప్రజలను ఆకట్టుకోవడానికి నాయకులు ప్రయత్నాలు సాగిస్తుంటారు. అయితే, వీరిలో కొందరి ప్రసంగాలే ఆసక్తికరంగా సాగుతుంటాయి. మరికొందరి మాటల్లో పదును ఉన్నప్పటికీ జనాన్ని ఆకట్టుకోవు. ఉత్తి ఊకదంపుడు ప్రసంగాలుగా మిగిలిపోతుంటాయి. కాగా, ఆర్థిక, వారసత్వ బలం లేకున్నా తమ వాగ్ధాటి ద్వారానే రాజకీయాల్లో ఎదిగిన నేతలున్నారు. వీరు చేసిందల్లా మాటనే మంత్రదండంగా ఉపయోగించడం.
మంత్రాలు రాజకీయాల్లో 'ప్రత్యక్షం'ముందే చెప్పుకొన్నట్లు రాజకీయాల్లో కుతంత్రాలే కాక మంత్రతంత్రాలూ ఉంటాయి. అంతేకాదు.. అసలు రాజకీయాలంటేనే నమ్మకం మీద ఆధారపడి సాగేవని చెప్పక తప్పదు. అది దేవుడి మీదైనా.. ప్రజల మీదైనా.. కార్యకర్తల మీదైనా.. అయితే, చాలామంది నాయకులు దేవుడిని విపరీతంగా విశ్వసిస్తుంటారు. రాజకీయ పరంగా ఏ కార్యక్రమం చేపట్టినా పూజలు-ప్రార్థనలతో మొదలు పెడుతుంటారు. ఎన్నికల సమయంలో అయితే ఇష్ట దైవం వద్ద తొలిగా పూజలు చేయడమో, నామినేషన్ పత్రాలు ఉంచడమో చేసే నాయకులకు కొదువ లేదు.
తాంత్రికం యాంత్రికం.. తాజాగా తెలంగాణలో అధికార టీఆర్ఎస్ నాయకత్వంపై బీజేపీ కీలక నేతలు తీవ్ర విమర్శలకు దిగారు. సీఎం కేసీఆర్ తన ఫాంహౌస్ లో మూడు నెలలకోసారి నల్ల పిల్లితో క్షుద్ర పూజలు చేయిస్తున్నారని.. ఓ తాంత్రికుడి సలహాతోనే ఇలా చేస్తున్నారంటూ బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ ఆరోపించారు. ఫాం హౌస్ లో ఇప్పటివరకు ముగ్గురు చనిపోయారంటూ అనుమానాలు రేకెత్తేలా వ్యాఖ్యలు చేశారు. కాగా, సంజయ్ ఒక్కరే ఆరోపణలు చేశారంటూ రాజకీయ వేడిలో అనుకోవచ్చు. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ సైతం కేసీఆర్ తాంత్రికుల సలహాతోనే నడుస్తున్నారని విమర్శలు చేశారు. వెరసి.. ఒకే రోజు ఇద్దరు కీలక నేతలు తెలంగాణ సీఎంపై తాంత్రిక పూజలంటూ ఆరోపణలకు దిగడం చర్చనీయాంశమైంది. కాగా, కొంతకాలం కిందట విజయవాడలోని ప్రముఖ ఆలయంలో తాంత్రిక పూజలు జరిగాయంటూ ఆరోపణలు వచ్చాయి. దీనిపై విచారణ కూడా జరగడం గమనార్హం.
గతంలో ఎన్టీఆర్ పైనా.. ఉమ్మడి ఏపీలో సీఎంలుగా పనిచేసినవారిలో ఎన్టీఆర్, వైఎస్సార్ మంచి పేరు తెచ్చుకున్నారు. వీరిద్దరి సొంతంగా ఫాం హౌస్ లు ఉండడం గమనార్హం. అయితే, ఎన్టీఆర్ కు హైదరాబాద్ శివారు గండిపేటలో ఉన్న క్షేత్రాన్ని కుటీరంగా పిలిచేవారు. వైఎస్ వ్యవసాయ క్షేత్రం పేరు ఇడుపులపాయ ఎస్టేట్ గా అందరికీ సుపరిచితమే. కాగా, ఎన్టీఆర్ పైనా గతంలో ఆయన సీఎంగా ఉండగా.. పూజల విషయంలో ఇప్పుడు సీఎం కేసీఆర్ పై వచ్చినట్లే విమర్శలు వచ్చాయి. దీనిని అప్పటి ప్రతిపక్షాలు పెద్ద అంశంగా చేసి ఆరోపణలకు దిగేవి. ఉమ్మడి ఏపీ రాజకీయాల్లో నాడు ఇదో కలకలం. అయితే, ఎన్టీఆర్ మీద ఏ స్థాయిలో ఆరోపణలు చేసినా అవేవీ నిరూపితం కాలేదు. రాజకీయ విమర్శలుగానే మిగిలిపోవడం ఇక్కడ చెప్పుకోదగ్గ అంశం. మరి.. ఇప్పుడేం జరుగుద్దో?