గ్రేట‌ర్ పోల్‌: 12 గంట‌ల‌కు 21 శాత‌మేనా?

Update: 2016-02-02 09:38 GMT
వాడీవేడిగా సాగిన ఎన్నిక‌ల ప్ర‌చారం. పార్టీ అధినేత‌లు.. వారి వార‌సులు ఎన్నిక‌ల సంద‌ర్భంగా ఘాటుగా వ్యాఖ్య‌లు చేసుకోవ‌టం తెలిసిందే. ఇలా ఒక‌రిపై మ‌రొక‌రు చేసుకున్న విమ‌ర్శ‌ల‌తో వాతావ‌ర‌ణం వేడెక్కిన ప‌రిస్థితి. ఈ నేప‌థ్యంలో గ్రేట‌ర్ ఎన్నిక‌ల‌పై ప్ర‌తిఒక్క‌రికి ఉత్కంట పెంచింది. న‌గ‌ర ప్ర‌జ‌లు ఓటింగ్ కు దూరంగా ఉంటార‌ని.. పెద్ద‌గా స్పందించర‌న్న అప‌వాదు నేప‌థ్యంలో.. ఈసారి ప్ర‌చారం సాగిన తీరు చూసి.. ఓటింగ్ శాతం భారీగా ఉంటుంద‌న్న అంచ‌నాలువ్య‌క్త‌మ‌య్యాయి.

అయితే.. అలాంటిదేమీ లేద‌ని.. గ్రేట‌ర్ పోలింగ్‌పై న‌గ‌ర ప్ర‌జ‌ల స్పంద‌న అంతంత‌మాత్రంగా ఉంద‌న్న మాట పోలింగ్ స‌ర‌ళిని చూస్తే ఇట్టే అర్థ‌మ‌వుతుంది. ఉద‌యం 7 గంట‌ల‌కు మొద‌లైన పోలింగ్ ప్ర‌క్రియ సాయంత్రం 5 గంట‌ల వ‌ర‌కు సాగ‌నుంది. మ‌ధ్యాహ్నం 12 గంట‌ల స‌మ‌యానికి పోలింగ్ 21 శాతాన్ని దాట‌క‌పోవ‌టం గ‌మ‌నార్హం. తొలి ఐదు గంట‌ల‌కు కేవ‌లం 21 శాతం మాత్ర‌మే పోలింగ్ న‌మోదు కావ‌టం.. పోలింగ్ ముగిసేందుకు మ‌రో 5 గంట‌లు మాత్ర‌మే ఉండ‌టంతో భారీ పోలింగ్‌కు అవ‌కాశం లేద‌న్న మాట వినిపిస్తోంది. అనూహ్యంగా మ‌ధ్యాహ్నం భోజ‌నాలు అయ్యాక పోలింగ్ పెరిగితే త‌ప్ప 50శాతం కూడా దాటే అవ‌కాశం లేద‌న్న మాట వినిపిస్తోంది. పోలింగ్ ప‌ట్ల న‌గ‌ర‌జీవికి ఎందుకంత నిరాస‌క్త‌త‌.
Tags:    

Similar News