తాజ్ మహల్ ప్రపంచం లో ఉన్న ఏడు వింతలలో ఒకటి. ప్రతి ఒక్కరూ కూడా జీవితంలో ఒక్కసారైనా చూడాలని కోరుకునే ప్రదేశాలలో తాజ్ మహల్ కూడా ఒకటి. ఈ తాజ్ దగ్గర లెక్కికి మించిన సినిమాలు తెరకెక్కాయి. ఎన్నో అపురూపమైన సాంగ్స్ చిత్రీకరించబడ్డాయి. ప్రపంచ నలుమూలల నుండి ఈ తాజ్ మహల్ ని చూడటానికి పర్యాటకులు వస్తుంటారు. కానీ , కొన్ని రోజులుగా తాజ్ మహల్ ని మూసేసారు. దానికి ప్రధాన కారణం కాలుష్యం. ఢిల్లీ లో కాలుష్యం ప్రస్తుతం తీవ్ర స్థాయిలో ఉంది. ప్రమాద స్థాయిలో కాలుష్యం పెరిగిపోవడంతో ఢిల్లీ లో ఎమర్జెన్సీ ప్రకటించిన విషయం తెలిసిందే. అలాగే ఢిల్లీ లో ఇక ఉండలేము అంటూ కొంతమంది ఢిల్లీని వదిలి వెళ్లిపోతున్నారు. మరికొంతమంది అసలు ఢిల్లీ నుండి దేశ రాజధానిని తరలించాలని కోరుతున్నారు.
ఇకపోతే నిన్న ఏకంగా.. కాలుష్యం 1000 సూచిని దాటి రికార్డు బ్రేక్ చేసింది. దీంతో అధికారులు మరింత సమాయత్తం అవుతున్నారు. కాగా, ఢిల్లీ కాలుష్యంతో భారతదేశ చారిత్రాత్మక కట్టడం.. తాజ్‌మహాల్ తేజస్సు మసకబారుతోంది. గాలిలోని కర్బన రేణువులు, దుమ్ము కారణంగా.. తాజ్ మహల్ తేజస్సు తగ్గిపోతోందని, నిపుణులు చెబుతున్నారు. అంతేకాకుండా.. తాజ్ చుట్టు ప్రక్కల పరిసరాలు కూడా వాయు కాలుష్యంతో నిండిపోయింది.
అయితే.. తాజ్‌ను కాపాడేందుకు ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం నడుం బిగించింది. ఎలాగైనా చారిత్రాత్మక కట్టడాన్ని కాపాడుకునేందుకు ఓ కొత్త ఐడియాను అమలుచేస్తుంది. తాజ్ మహల్ పరిసరాలను, ఆ ప్రాంతాల్లోని గాలిని శుభ్రపరిచే ఎయిర్ ఫ్యూరిఫైయర్లను తీసుకొచ్చింది. కాలుష్య నియంత్రణ వ్యాన్ 300 మీటర్ల వ్యాసార్థంలో 8 గంటల్లో 15 లక్షల క్యూబిక్ మీటర్ల గాలిని శుద్ధి చేస్తుందని అధికారులు తెలిపారు. యూపీకి తోడుగా, సామాజిక బాధ్యతలో భాగంగా దిగ్గజ టెలికాం సంస్థలు వొడాఫోన్-ఐడియా కూడా ముందుకొచ్చాయి.