కుక్క ఎఫైర్ పెట్టుకుందని వదిలేశాడు..

Update: 2019-07-23 10:21 GMT
ఎంతో నమ్మకం పెంచుకొని నమ్మిన వాళ్లు మోసం చేస్తే.. వివాహేతర సంబంధాలు పెట్టుకుంటే  తట్టుకోలేరు. అది దాడులకు, హత్యలకు కూడా దారితీస్తుంది. అయితే ఇప్పటి సమాజంలో ఇప్పుడు ఎఫైర్లు పుష్కలంగా చోటుచేసుకుంటున్నాయి.. పట్టణాల్లో అయితే మరీ కామన్ గా ఉన్నాయి. సహజీవనాలు చేయడాలు.. నచ్చకపోతే విడిపోవడాలు జరుగుతున్నాయి. విదేశాల్లో అయితే పెచ్చరిల్లిపోయింది పరిస్థితి.

కానీ ఇక్కడో పెద్ద మనిషి కుక్క ఎఫైర్ పెట్టుకుందని దాన్ని నడిబజారులో వదిలేసిన ఘటన వైరల్ గా మారింది. అంతేకాదు.. దాన్ని ఎందుకు నడిబజారులో వదిలేస్తున్నదీ.. దానికి కారణంగా దాని మెడలో పెద్ద నోట్ రాసి వదిలేశాడు. ఆ కుక్కను ఫొటో తీసుకున్న జంతువుల హక్కుల కార్యకర్త శ్రీదేవి ఎస్ కర్తా ఫేస్ బుక్ లో పోస్టు చేశారు. అది కాస్తా వైరల్ కావడంతో సెటైర్లు పేలుతున్నాయి..

తాజాగా కేరళ రాజధాని తిరువనంతపురంలోని ఓ బిజీ రోడ్డులో పొమేరియన్ జాతికి చెందిన ఓ మేలు జాతి కుక్కను నడిరోడ్డుపై వదిలేయగా దారి తప్పి అది అటూ ఇటూ తిరుగుతోంది. అయితే గమనించిన స్థానికులు కుక్కను చేరదీశారు. దాని మెడలో పెద్ద ఉత్తరమే ఉంది. అది టాప్ బ్రీడ్ జాతికి చెందిన కుక్క అని అస్సలు కరవదని.. పాలు, బిస్కెట్, ఎగ్స్ ఇష్టంగా తింటుందని.. ఎంతో మంచిగా ఉంటుందని పెంచుకున్నామని రాసుకొచ్చారు. అయితే తాజాగా ఆ కుక్క తమ పక్కింట్లోని మరో శునకంతో అక్రమసంబంధం పెట్టుకుందని.. దాన్ని జీర్ణించుకోలేకే వదిలేస్తున్నామని లెటర్ లో యజమాని పేర్కొన్నాడు.

ఎఫైర్ పెట్టుకుందని కుక్కను వదిలేసిన వైనం ఇప్పుడు సోసల్ మీడియాలో వైరల్ గా మారింది. మనుషులకే దిక్కులేదు.. కుక్కలు పెట్టుకుంటే వదిలేస్తారా అని కొందరు నెటిజన్లు సెటైర్లు వేస్తుండగా.. ఈ సమాజంలో ఇది కామన్ అని.. కుక్కలు పెట్టుకుంటే ఇలా చేస్తారా అని యజమాని తీరును తప్పుపడుతున్నారు. దీన్ని బట్టి ఆ కుక్కంటే వాళ్లకు ఎంతో ప్రాణమని.. అది ఇలా చేయడంతోనే వదిలేశారని మరికొంత మంది నెటిజన్లు యజమానికి సపోర్టుగా కామెంట్ చేస్తున్నారు.


    

Tags:    

Similar News