గత ఎన్నికల్లో పీసీసీ అధ్యక్షుడిగా ఉన్న పొన్నాల లక్ష్మయ్యకు మొదటి జాబితాలో పేరు లేకపోయేసరికి కాంగ్రెస్ లో కలకలం రేగిన సంగతి తెలిసిందే. దీంతో పొన్నాల వర్గం తీవ్ర అసంతృప్తికి గురయ్యింది. పొన్నాల ఢిల్లీ వెళ్లి టిక్కెట్ కోసం పట్టుబట్టారు. అయితే, ఇది కూటమి ఎఫెక్ట్ అని - ఎంపీ సీటు ఇస్తాం.. ఎమ్మెల్యే స్థానం కోదండరాంకు వదులుకోమని కాంగ్రెస్ కోరింది. అయితే, పట్టువీడని పొన్నాల తీవ్రంగా ప్రయత్నించారు. ఢిల్లీలో తిష్టవేశారు. ఎట్టకేలకు ఆయన ప్రయత్నాలు ఫలించినట్లే ఉన్నాయి.
పొన్నాల స్వంత నియోజకవర్గం జనగామ. అక్కడ ఇప్పటికే చాలా సార్లు పోటీచేశారు. అయితే, కోదండరాంకు ఇస్తే కచ్చితంగా ఆ సీటు గెలిచే అవకాశం ఉందని కాంగ్రెస్ భావించింది. దీంతో మెలిక పెట్టింది. ఈ కఠిన నిర్ణయంతో పొన్నాల వర్గం అవాక్కయింది. నిజానికి మొదటి లిస్టు వచ్చే వరకు కాంగ్రెస్ నుంచి పొన్నాల లక్ష్మయ్యకే టిక్కెట్ అని అందరూ ఫిక్సయ్యారు. ఆయన కూడా ప్రచారం మొదలుపెట్టారు అప్పటికే. కాంగ్రెస్ ఇచ్చిన ట్విస్టుతో ఆయన ఢిల్లీ ఫ్లైటు ఎక్కారు.
ఇంతకీ పొన్నాల వాదన ఏంటంటే అసలే బీసీలకు తక్కువ సీట్లు ఇచ్చారు. సీనియర్ బీసీ నాయకుడు అయిన నాకు టిక్కెట్ ఇవ్వకుంటే ప్రజల్లోకి తప్పుడు సంకేతాలు వెళతాయి అని పొన్నాల లక్ష్మయ్య అధిష్ఠానం వద్ద వివరించారు. నాలుగు రోజుల పాటు అక్కడే ఉన్నారు. ఆయన పట్టుబట్టడంతో కాంగ్రెస్ అధిష్టానం ఆలోచనలో పడింది. ఢిల్లీకి వెళ్లిన కోదండరాం కాంగ్రెస్ పెద్దలతో సమావేశం అయ్యారు. జనగామ సీటును వదులుకోవాలని ఆయనను వారు విజ్ఞప్తి చేశారట. కోదండరాం సరే అనడంతో పొన్నాలకు లైన్ క్లియర్ అయ్యింది. ఇదే మీటింగులో ఆసిఫాబాద్ - వరంగల్ తూర్పు - మిర్యాలగూడ స్థానాలపై కాంగ్రెస్ నేతలతో కోదండరాం చర్చించినట్లు సమాచారం.