కరోనా మహమ్మారి విజృంభణ తర్వాత ప్రపంచ వ్యాప్తంగా ఎన్నో విషయాల్లో కీలక మార్పులు చోటు చేసుకున్నాయి. కరోనా మహమ్మారి కట్టడికి ఏకైక మార్గం వ్యాక్సిన్ మాత్రమే కావడంతో ప్రపంచంలోని అన్ని దేశాలు కూడా వ్యాక్సినేషన్ ప్రక్రియ ను వేగవంతం చేశాయి. రెండు డోసులతో పాటుగా, ప్రపంచ వ్యాప్తంగా అనేక అభివృద్ధి చెందిన దేశాలలో కోవిడ్ వ్యాక్సిన్‌కి సంబంధించి బూస్టర్ షాట్‌లు వేయడం ప్రారంభం అయ్యింది. వ్యాక్సిన్ తయారీదారులు కరోనా వ్యాక్సిన్ మూడవ డోసు రోగనిరోధక శక్తిని పెంచడానికి, ముఖ్యంగా కొందరికి అవసరం అని చెబుతున్నారు.
ఈ క్రమంలోనే యునైటెడ్ స్టేట్స్‌లో, బైడెన్ అడ్మినిస్ట్రేషన్ ప్రతిఒక్కరికీ రెండవ డోసు వేసుకున్న ఎనిమిది నెలల తర్వాత మూడో షాట్ వేసుకునేందుకు ఓకే చెప్పింది. అయితే, అనేక అభివృద్ధి చెందుతున్న తక్కువ, ఆదాయ దేశాలు తమ జనాభాకు ఒక్క డోసు వ్యాక్సిన్ వేయడానికే ఇప్పటికీ కష్టపడుతున్నారు. ఇటువంటి సమయంలో మూడో డోసు వేయించుకోవడం నైతికం కాదని కొందరి అభిప్రాయం.ఈ క్రమంలోనే భారతదేశంలో, అతిపెద్ద వ్యాక్సిన్ తయారీ సంస్థ సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా అధార్ పూనవల్లా మూడవ డోసు ‘అనైతికం’ అంటూ కీలక వ్యాఖ్యలు చేశారు.
తన తండ్రి మరియు SII ఛైర్మన్ సైరస్ పూనవల్లా మాత్రం వ్యాక్సిన్ మూడవ డోస్ ‘తప్పనిసరి’ అని చెప్పిన కొన్ని వారాల తర్వాత అధార్ పూనవల్లా వ్యాఖ్యలు చేయడం విశేషం. రెండవ డోస్ తీసుకున్న ఆరు నెలల తర్వాత మూడో డోసు ఇవ్వాలని, ఎస్ఐఐ చీఫ్ సైరస్ చెప్పారు. చాలా బలహీనమైన విభాగాల్లోని వ్యక్తులకే మూడవ డోసు ఇవ్వాలి. మొదటి రెండు డోసులు అందరికీ పూర్తి అవ్వకుండా మూడో డోసు ఇవ్వడం అనైతికం అని అతని అభిప్రాయం.
మూడవ డోస్ అవసరమని ఇప్పటివరకు ఎటువంటి ఆధారాలు లేవని, అధికారికంగా కూడా దేశంలో సిఫార్సు చేయలేదని అధార్ పూనవల్లా చెప్పారు. ఫైజర్ మరియు మోడర్నా వంటి వ్యాక్సిన్ తయారీదారులు కాలక్రమేణా వ్యాక్సిన్ సమర్థత క్షీణిస్తుందని బూస్టర్ షాట్ కోసం ఒత్తిడి చేసినప్పటికీ శాస్త్రీయంగా ఈ విషయం నిరూపితం అవ్వలేదు. ఈ క్రమంలోనే అధార్ పూనవల్లా చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశం అవుతున్నాయి.