ఒక్క‌రోజే వెయ్యి దాటాయి: ‌తెలంగాణ‌లో వైర‌స్ క‌ల్లోలం

Update: 2020-06-27 17:10 GMT
వైర‌స్ రోజురోజుకు తెలంగాణ‌లో కొత్త రికార్డులు సృష్టిస్తోంది. రికార్డు మేర కేసులు న‌మోద‌వుతున్నాయి. తాజాగా తెలంగాణ‌లో ఒక్క‌రోజే వెయ్యికి పైగా కేసులు న‌మోద‌వ‌డం క‌ల‌క‌లం రేపుతోంది. శ‌నివారం ఒక్క‌రోజే 1,087 పాజిటివ్ కేసులు న‌మోద‌య్యాయి. ఇక ఆరుగురు మృత్యువాత ప‌డ్డారు. ఈ విధంగా కేసులు పెరుగుతుండ‌డంతో ప్ర‌జ‌లు భ‌యాందోళ‌న చెందుతున్నారు. ముఖ్యంగా హైద‌రాబాద్‌లో ఆందోళ‌క‌ర ప‌రిస్థితులు ఏర్ప‌డ్డాయి. 3,923 ప‌రీక్ష‌లు చేయ‌గా వెయ్యికి పైగా కేసులు పెర‌గ‌డం రాష్ట్రంలో ప‌రిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవ‌చ్చు.

ఈ కేసుల‌తో క‌లిపి రాష్ట్రంలో మొత్తం కేసులు 13, 436కి చేరాయి. తాజాగా 162 మంది వైర‌స్ నుంచి కోలుకుని డిశ్చార్జ‌య్యారు. మొత్తం మృతులు 243 ఉండ‌గా, ఇప్ప‌టివ‌ర‌కు డిశ్చార్జైన వారి సంఖ్య 4,928. కొత్త కేసుల్లో జీహెచ్ఎంసీ ప‌రిధిలో య‌థావిధిగా అత్య‌ధికంగా కేసులు న‌మోద‌య్యాయి. 888 కేసులు హైద‌రాబాద్‌లో తేలాయి. అనంత‌రం రంగారెడ్డి 74, మేడ్చ‌ల్ 37, న‌ల్గొండ 35 కేసులు వెలుగులోకి వ‌చ్చాయి.

తెలంగాణ‌లో మొత్తం ప‌రీక్ష‌లు 79,231
మొత్తం పాజిటివ్ కేసులు 13, 436
డిశ్చార్జైన వారి సంఖ్య     ‌4,928
మొత్తం మృతులు      243

Tags:    

Similar News