కరోనా టీకా తీసుకున్న ముగ్గురు వైద్యులకుకి పాజిటివ్ !

Update: 2021-02-13 13:30 GMT
ప్రపంచాన్ని అతలాకుతలం చేసిన కరోనా వైరస్ మహ్మమారి‌ ఇప్పటికీ ప్రజలను భయాందోళనకు గురిచేస్తోంది. ప్రపంచ వ్యాప్తంగా వ్యాక్సినేషన్‌ ప్రక్రియ వేగవంతంగా సాగుతున్నప్పటికీ ఏదో ఒక మూలన దాని ప్రభావం ఇంకా కొనసాగుతూనే ఉంది. తాజాగా భారత్ ‌లోనూ అక్కడక్కడ కరోనా కొత్త కేసులు రావడం ఆందోళన కలిగిస్తుంది. అయితే వ్యాక్సిన్‌ వారికి కూడా కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ కావడం వైద్యులను సైతం కలవరానికి గురిచేస్తోంది.

తాజాగా హిమాచల్‌ ప్రదేశ్‌లోని సిమ్లాలో ఇందిరా గాంధీ మెడికల్‌ కాలేజీలో వైద్యులుగా విధులు నిర్వర్తిస్తున్న ముగ్గురికి తాజాగా కరోనా పాజిటివ్‌ గా తేలింది. వీరిలో వైద్యులైన భార్యభర్తలు కూడా ఉన్నారు. వారు 10 రోజుల కిందటే వ్యాక్సిన్‌ తొలి డోసును తీసుకున్నారు.గత రెండు రోజులుగా వారిలో స్పల్ప కరోనా లక్షణాలు కనిపించడంతో అత్యున్నత వైద్య బృందం సమక్షంలో మరోసారి కరోనా‌ పరీక్షలు నిర్వహించగా ముగ్గిరికీ పాజిటివ్‌ గా తేలింది.

 దీనితో వైద్యులు ఆశ్చర్యంలో మునిగిపోయారు. వ్యాక్సిన్‌ తీసుకున్నాక కూడా పాజిటివ్ ‌గా తేలడంతో ఆందోళన చెందారు. ప్రస్తుతం వారిని కోవిడ్‌ వార్డులో ఐసోలేషన్‌ చేసినట్లు తెలిపారు. అయితే ఇతరుల ద్వారానే వైరస్‌ వీరికి సోకినట్లు డాక్టర్‌ పతానియా వెల్లడించారు. మరోవైపు దేశ వ్యాప్తంగా కరోనా రెండో డోస్‌ ప్రక్రియ కూడా ఆరంభమైన విషయం తెలిసిందే. తొలిడోస్‌ వేసుకున్న వారికి ఈ విడతలో వ్యాక్సిన్‌ వేయనున్నారు.
Tags:    

Similar News