భైంసాలో అంత దారుణం జరిగిందా? కిషన్ రెడ్డికి ఏకరువు లేదా

Update: 2020-02-16 12:18 GMT
భైంసాలో ఏదో జరిగిందన్నట్లుగా మీడియాలో వార్తలు అలా అలా వచ్చి వెళ్లిపోయాయి. అక్కడ చోటు చేసుకున్న సున్నిత అంశాల్ని మరింత ఎగదోయకూడదన్నట్లు మీడియా సంయమనం వహించినట్లుగా వార్తలు వచ్చాయి. అసలేం జరిగిందన్న ఆరా తీస్తే.. ఏదో చిన్న గొడవ చివరకు రచ్చ రచ్చగా మారినట్లుగా మీడియాలో వచ్చినా.. దానికి సంబంధించిన వివరాలు పెద్దగా వచ్చింది లేదు.

భైంసాలో ఏదో జరిగిందన్న వాదన మీద రాజకీయ నేతలు పెద్దగా మాట్లాడింది లేదు. ఈ ఉదంతం జరిగిన ఇన్ని రోజులకు కేంద్ర సహాయ మంత్రి కిషన్ రెడ్డి భైంసాలో పర్యటించారు. ఈ సందర్భంగా బాధితులు పలువురు కేంద్రమంత్రి ముందుకు వచ్చారు. తమకు ఎదురైన చేదు అనుభవాల గురించి వాపోయారు. వారు చెప్పిన వివరాలు విన్న వారంతా విస్మయానికి గురయ్యారు. ఇంత జరిగినా.. బయటకు పెద్దగా వివరాలు వచ్చిందేమీ లేదే? అన్న భావన కలగటం ఖాయం.

వందల మంది రాళ్లు.. పెట్రోల్ బాంబులతో దాడి చేశారని.. కట్టుబట్టలు కూడా మిగల్చకుండా మొత్తం తగులబెట్టారన్నారు. పండుగ పూట పిండి వంటల్లో మూత్రం పోసినట్లుగా కిషన్ రెడ్డి ముందుకు కొందరు బాధితులు తమ ఆవేదన వ్యక్తం చేశారు. కిషన్ రెడ్డి వెంట బీజేపీ ఎంపీలు అరవింద్.. బండి సంజయ్.. సోయం బాపూరావుతో పాటు బీజేపీ రాష్ట్ర అధ్యక్ష్యడు లక్ష్మణ్ కూడా ఉన్నారు. ఘర్షణలుచోటు చేసుకున్న చేత బాధితుల్ని పరామర్శించారు. తమపై జరిగిన దాడులు.. వేధింపుల గురించి ఏకరువు పెట్టారు. ఈ వివరాలు ఇప్పుడు సంచలనంగా మారాయి. మరి.. తన వరకూ వచ్చిన అంశాలపై  కేంద్రమంత్రి హోదాలో ఉన్న కిషన్ రెడ్డి ఎలా రియాక్ట్ అవుతారన్నది ఇప్పుడు ప్రశ్నగా మారింది.


Tags:    

Similar News