అసలే బాబు గారు ఠారెత్తి ఉన్నారు. జోలెపల్లి అమరావతి రైతులకు మద్దతుగా మచిలీపట్నంలో జేఏసీ నేతలతో కలిసి విరాళాలు సేకరించారు. ఆ కడుపు మంటలోనే సభ పెట్టారు. ఇక ప్రసంగం మొదలుపెడుతుండగా షాక్.. పవర్ కట్ అయిపోయింది. ఇప్పటికే బాబుకు పవర్ కట్ చేసిన వైసీపీ అధినేత జగన్ ఇప్పుడు బాబు ప్రసంగానికి కూడా పవర్ కట్ చేశారని నేతలు లోలోపల సెటైర్లు వేసుకున్నారు.
కానీ ఆ చీకట్లోనూ ప్రతిపక్ష టీడీపీ అధినేత చంద్రబాబు చెడుగుడు ఆడేశారు. చంద్రబాబు సభలో చీకటి కమ్ముకోవడంతో అక్కడికొచ్చిన ప్రజలను సెల్ ఫోన్లు తీసి ఆన్ చేసి ఆ వెలుతురులో ప్రసంగం వినాలని సూచించారు.వారంతా అదే పనిచేయడంతో చంద్రబాబు మొదలెట్టారు. తాను ప్రసంగించకుండా వైసీపీ సర్కారు కరెంట్ సరఫరా నిలిపివేసిందని.. ఉద్యమాన్ని అణిచివేసేందుకే ఇలాంటి పనులు చేస్తోందని బాబు గారు ఆరోపించారు. దీన్ని ట్విట్టర్ లో కూడా పెట్టి పవర్ లేని బాబుకు పవర్ కట్ చేశారు అన్నట్టుగా ప్రసంగం వీడియోను షేర్ చేశారు. దీనిపై సెటైర్లు పడుతున్నాయి. ఈ ఆసక్తికర సీన్ మచిలీపట్నం లో కనువిందు చేసింది.
ఈ సందర్భంగా ఆ చిమ్మీ చీకట్లోనే చంద్రబాబు మాట్లాడారు.. అమరావతి రైతుల తరుఫున పోరాడుతానని.. వెనక్కి తగ్గనని నినదించారు. కరెంట్ సరఫరా పునరుద్దరించడంతో ప్రసంగాన్ని కొనసాగించారు.