వైరస్ మృతుల అంత్యక్రియలు చేస్తున్న పవర్ లిఫ్టర్

Update: 2020-07-25 08:30 GMT
వైరస్ బారిన పడి చనిపోయిన వారి అంత్యక్రియలు చేయడం తలనొప్పిగా మారింది.  సొంత కుటుంబసభ్యులు కూడా ఆ అంత్యక్రియల్లో పాల్గొనలేని పరిస్థితి. వైరస్ తో మృతి చెందిన కుటుంబాన్ని స్థానికులు వివక్ష చూపుతున్నారు. ఆ మృతదేహం తరలించడానికి కూడా ఎవరూ రాలేని పరిస్థితి. తమకు ఎక్కడ వైరస్ వ్యాపిస్తోందనే భయంతో వారు వారిని దూరం చేస్తున్నారు. ఇలాంటి సమయంలో ఓ పవర్ లిఫ్టర్ వైరస్ మృతదేహాల అంత్యక్రియల్లో పాల్గొంటున్నారు. వైరస్ మృతదేహాల అంత్యక్రియలకు ఓ స్వచ్ఛంద సంస్థ తో కలిసి ఆయన పని చేస్తున్నారు.  ఆయనే ప్రఖ్యాత పవర్‌ లిఫ్టర్‌ మొహమ్మద్‌ అజ్మతుల్లా. ఆయన మెర్సీ మిషన్‌తో భాగస్వామ్యులై వైరస్ తో మరణించిన మృతదేహాలను మోసుకువెళ్లి అంతిమ సంస్కారాలు చేస్తున్నారు. దీంతో అతడు అందరి ప్రశంసలు పొందుతున్నారు.

ఈ సందర్భంగా పవర్ లిఫ్టర్ మీడియాతో మాట్లాడారు. వైరస్ కారణంగా మరణించిన వ్యక్తి మృతదేహాన్ని మోస్తున్నప్పుడు తాను అనుభవించిన బాధను మాటలతో చెప్పలేను అని పేర్కొన్నారు. మరణం ఎవరికైనా ఎప్పుడైనా వస్తుంది. వైరస్ తో మరణించిన వారిని చూసి అందరూ భయపడుతున్నారని తెలిపారు. వారి దగ్గరకు కూడా రావడం లేదని చెప్పారు. వైరస్ వచ్చి 20ఏళ్ల వయసులోనే మరణించిన వారిని తాను చూసి ఎంతో ఆవేదన పొందినట్లు ఆవేదన వ్యక్తం చేశారు. 80 ఏళ్ల వయసులో కూడా వైరస్ ను జయించిన వారిని కూడా చూశానని.. వైరస్ మనకు కూడా ఎప్పుడొకసారి రావచ్చు అని పేర్కొన్నారు. దాని గురించి తనకు భయం లేదని తెలిపారు. అయినా కూడా  తాను అన్ని జాగ్రత్తలు తీసుకొని మృతదేహాలను ఖననం చేస్తున్నట్లు వివరించారు.  ఎందుకంటే తనకు కూడా కుటుంబం ఉందని పవర్ లిఫ్టర్ అజ్మతుల్లా తెలిపారు.

ఈ పవర్ లిఫ్టర్ అజ్మతుల్లా ఐటీ సంస్థ డిఎక్స్ సీ టెక్నాలజీలో ప్రోగ్రామ్ మేనేజర్‌గా పని చేస్తూనే వారాంతాలలో సేవా కార్యక్రమాల్లో పాల్గొంటుంటారు. లాక్‌డౌన్‌లో కూడా సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. జూలై నెలలో వైరస్ మరణాలు ఎక్కువ కావడంతో వారి ఖననంలో కూడా పాలుపంచుకుంటున్నారు.
Tags:    

Similar News