హైదరాబాద్ జూబ్లీహిల్స్ లోని మెగాస్టార్ చిరంజీవి వైట్ హౌస్ లో ఆదివారం పండుగ వాతావరణం నెలకొంది. మెగాస్టార్ పుట్టినరోజు.. అదే రోజు రక్షాబంధన్ కావడంతో మెగా వంశం మొత్తం చిరు ఇంట సమావేశమైంది. ఇది అరుదైన సన్నివేశం. అందుకు సంబంధించిన వీడియోను కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ యూట్యూబ్ ఛానెల్ షేర్ చేసింది.
పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ తన వదిన సురేఖను పలకరించినప్పుడు వీడియోలోని సరదాగా మాటా మంతి జరిపారు. అన్నయ్య చిరును కౌగిలించుకున్న తర్వాత పవన్ సురేఖ వద్దకు చేరుకోగానే.. ``ఏంటి సురేఖ గారూ .. బాగున్నారండీ ..?`` ఆమె అతని కుడి చేతిపై అతన్ని కొట్టింది. ఇది వారి మధ్య ఆప్యాయతతో కూడిన చక్కని కుటుంబ బంధాన్ని ఆవిష్కరించింది. పవన్ ఎంతో సరదాగా అన్నా వదినా కుటుంబంతో గడిపిన మధుర క్షణాల్ని ఈ వీడియో బహిర్గతం చేసింది.
వదిన సురేఖ తనకు తల్లి అని చిరు తండ్రి లాంటి వ్యక్తి అని తరచుగా చెబుతుంటారు. పవన్ ఇద్దరిపై ఉన్న ప్రేమ గౌరవాన్ని ఏనాడూ దాచుకోలేదు. ఇక బర్త్ డే బోయ్ చిరంజీవి కుటుంబ సభ్యులందరి సమక్షంలో కేక్ కట్ చేస్తారు. ఈ వేడుకల్లో రామ్ చరణ్ - ఉపాసన- అల్లు అరవింద్- వరుణ్ తేజ్- సాయి తేజ్- వైష్ణవ్- నిహారిక- సుస్మిత కొణిదెల సహా చిరు సోదరీమణులు ఉన్నారు.
22 ఆగస్ట్ మెగాస్టార్ బర్త్ డే సందర్భాన్ని పురస్కరించుకుని సినీరాజకీయ ప్రముఖులు సహా అభిమానులు ఆయనకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. సోషల్ మీడియాల్లో శుభాకాంక్షల సునామీ పోటెత్తింది. ఇండస్ట్రీ వర్గాలు సహా ఈసారి ప్రజల్లోనూ మెగాస్టార్ పై నూతనోత్సాహం పరవళ్లు తొక్కింది. పరిశ్రమ అగ్ర కథానాయకులంతా మెగాస్టార్ కి శుభాకాంక్షలు తెలిపారు. మాజీ ముఖ్యమంత్రి తేదేపా అధినేత చంద్రబాబు నాయుడు సైతం ఫోన్ లో మెగాస్టార్ చిరంజీవికి శుభాకాంక్షలు తెలిపారు. క్రికెట్ గాడ్ సచిన్ టెండూల్కర్ .. తెలంగాణ మంత్రి కేటీఆర్ సైతం చిరంజీవికి ట్విట్టర్ లో ప్రత్యేకించి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు.
సంక్రాంతి - దసరా- క్రిస్మస్ సందర్భం ఏదైనా కానీ పండుగల వేళ ఇలా మెగా స్టార్ ఇల్లు కుటుంబ సభ్యులందరితో ఎంతో సంబరంగా కనిపిస్తుంది. ఇక మెగాస్టార్ పుట్టినరోజున ఆ వేడుక కన్నులపండుగనే తలపించింది.
ఇటీవలే మెగాస్టార్ చిరంజీవి- నాగబాబు- పవన్ కల్యాణ్ బృందం హైదరాబాద్ అల్యూమినియం ఫ్యాక్టరీ లొకేషన్ లో షూటింగ్ చేస్తుండగా లంచ్ చేసిన సంగతిని మెగాభిమానులు మరువలేరు. తనయులకు వడ్డిస్తూ ఆన్ లొకేషన్ అమ్మ అంజనా దేవి ప్రత్యక్షమవ్వడం మరపురాని జ్ఞాపకం అని చెప్పాలి. ఈసారి రక్షాబంధన్ .. పుట్టినరోజు కలిసి రావడంతో ఇంటిల్లిపాదీ వరుస ఫోటోషూట్లలో పాల్గొనగా ఆ ఫోటోలన్నీ అంతర్జాలంలో వైరల్ గా మరాయి. ఈ సంబరాల అనంతరం మెగాస్టార్ చిరంజీవి ఆచార్య రిలీజ్ గురించి ఆలోచిస్తారు. అలాగే మోహన్ రాజా దర్శకత్వంలో లూసీఫర్ రీమేక్ గాడ్ ఫాదర్ చిత్రీకరణలోనూ పాల్గొననున్నారు. తదుపరి బాబి దర్శకత్వంలోని వాల్టేర్ వీరన్న.. మెహర్ రమేష్ దర్శకత్వంలోని భోళా శంకర్ చిత్రాల షూటింగులకు షెడ్యూల్స్ ప్లాన్ చేయాల్సి ఉంటుంది.
Full View