ఆన్ లైన్ జూమ్ యాప్ ద్వారా జరుగుతున్న తెలుగుదేశం పార్టీ పండుగ ‘మహానాడు’ లో విభేదాలు భగ్గుమన్నాయి. పార్టీ ఓటమికి గల కారణాలపై నేతలు ఆరోపణలు గుప్పించారు. టీడీపీ ప్రభుత్వం ఓటమికి జరిగిన తప్పిదాలను శాప్ మాజీ చైర్మన్ పీఆర్ మోహన్ ప్రస్తావించి కడిగేశారు.
పార్టీ కోసం సర్వం ధారపోసిన వారికి చిప్పే మిగిలిందని.. అప్పుల పాలైనట్లు పీఆర్ మోహన్ ఆవేదన వెలిబుచ్చారు. చంద్రబాబు తనకు శాప్ చైర్మన్ పదవి ఇచ్చి గౌరవించారని.. అయితే చంద్రబాబు చుట్టే ఉండేవారే ఆయనను తప్పుదోవ పట్టించారని మండిపడ్డారు.
చంద్రబాబు సీఎంగా ఉన్న సమయంలో ఆయన సన్నిహితులు సతీష్ చంద్ర - రాజమౌళి - పీఎస్ శ్రీనివాస్ లు జీవోలు రాకుండా అడ్డుకున్నారని.. చంద్రబాబును కలవకుండా సతీష్ చంద్ర ఆపేవారని పీఆర్ మోహన్ ఆరోపించారు. చంద్రబాబు చుట్టూ ఉండే ఐఏఎస్ అధికారులే టీడీపీని నాశనం చేశారని మండిపడ్డారు. చంద్రబాబును కార్యకర్తలకు దూరం చేసింది అధికారులేనని అని అన్నారు.
డబ్బులు సంపాదించుకున్న టీడీపీ నేతలు ఖర్చు చేయడం లేదని.. సామాన్య కార్యకర్తలు నేతలు అప్పుల పాలవుతున్నారని పీఆర్ మోహన్ ఆరోపించారు.