గతంలో మాదిరి కాదు. ఇప్పుడు కెమేరా కళ్లు అనుక్షణం పహరా కాస్తుంటాయి. ఏ చిన్న పొరపాటు కూడా అందరి దృష్టికి వెళ్లే పరిస్థితి. ఈ డిజిటల్ యుగంలో ప్రజాప్రతినిధులు చాలా జాగ్రత్తగా వ్యవహరించాల్సిన అవసరం ఉంది. ఏ చిన్న పొరపాటు చేసినా అందరి కంట్లో పడటం ఖాయం. తాజాగా.. శుక్రవారం ఏపీ అసెంబ్లీ సమావేశం సందర్భంగా ఏపీ అధికారపక్ష ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ తీరును చూస్తే.. ఇది స్పష్టమవుతుంది.
చంద్రబాబు వెనుక ఉన్న ఆయన.. బాబు మీదకు కెమేరా ఫోకస్ చేసిన ప్రతిసారీ ఆయన టీవీ స్ర్కీన్ల మీద కనిపించే పరిస్థితి. ఇలాంటి సందర్భంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. కానీ.. అదే పట్టించుకోని చింతమనేని.. ఏదో నములుతున్నట్లు కనిపించారు. ఓపక్క చంద్రబాబు విపక్ష నేతపై విరుచుకుపడే సమయంలో.. చింతమనేని నోరుఆడిస్తూ కనిపించారు. దీన్ని కొంతమేర సర్దుబాటు చేసుకోవచ్చు. కానీ.. నోట్లో నుంచి ఏదో ఊసినట్లుగా కనిపించిన దృశ్యం మాత్రం అవాక్కు అయ్యేలా చేస్తుంది. జాగ్రత్తగా గమనించే వారికి తప్పించి మిగిలిన వారు పెద్ద పట్టించుకోరేమో కానీ.. కెమేరా కన్ను తనపై ఫోకస్ చేస్తున్న వేళ.. బాడీ లాంగ్వేజ్ విషయంలో కాస్తంత ఆచితూచి వ్యవహరిస్తే బాగుంటుందేమో.