నీరు క‌ష్టాల‌ పై ప్ర‌కాశం ఎమ్మెల్యేల నిల‌దీత‌!

Update: 2020-01-30 09:30 GMT
ప్ర‌కాశం జిల్లా అభివృద్ధి స‌మీక్షా స‌మావేశం లో ఎమ్మెల్యేలు ఘాటుగా స్పందించారు. అటు మంత్రులు, ఇన్ చార్జి మంత్రిని, అధికారుల‌ను ఎమ్మెల్యేలు నిల‌దీశారు. అటు అధికార పార్టీ ఎమ్మెల్యేలు కూడా వివిధ అంశాల గురించి ప్ర‌స్తావించి అసంతృప్తి వ్య‌క్తం చేశారు. అందులో నీటి స‌మ‌స్య ఒక‌టి. ప్ర‌కాశం జిల్లాలో తాగునీటి స‌మ‌స్య ఇప్ప‌టి వ‌ర‌కూ తీర‌డం లేదు. ఈ నేప‌థ్యం లో తాగునీటి స‌మ‌స్య అధికంగా ఉన్న ప‌ట్ట‌ణాల‌కు, ప‌ల్లెల‌కు సంబంధించి ప్ర‌జా ప్ర‌తినిధులు ప్ర‌స్తావించారు. స‌మ‌స్య ప‌రిష్కారం గురించి వారు మాట్లాడారు. ఈ జాబితాలో అధికార పార్టీ ఎమ్మెల్యేలు కూడా ఉండ‌టం గ‌మ‌నార్హం.

ఇక ఇత‌ర అంశాల గురించి కూడా ప్ర‌స్తావ‌న వ‌చ్చింది. తెలుగుదేశం పార్టీ కి కొద్దో గొప్పో ఎమ్మెల్యేలు ఉన్న జిల్లాల్లో ఒక‌టి ప్ర‌కాశం. ఈ నేప‌త్యం లో టీడీపీ ఎమ్మెల్యేలు వివిధ అంశాల‌ను ప్ర‌స్తావించారు. వివిధ ష‌ర‌తులు చూపి పెన్ష‌న్ల రద్దును చేస్తున్నార‌ని తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే చెప్పుకొచ్చారు. పెన్ష‌న్ల కోత తీవ్రంగా ఉంద‌ని టీడీపీ ఎమ్మెల్యేలు వ్యాఖ్యానించారు.

ఇక అభివృద్ధి నిధుల గురించి తెలుగుదేశం పార్టీ కి చెందిన కొండెపి ఎమ్మెల్యే స్వామి ప్ర‌స్తావించారు. మ‌రోవైపు మాజీ మంత్రి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే మానుకోట మ‌హీధ‌ర్ రెడ్డి అధికారుల‌ పై గ‌రం అయ్యారు. ప్ర‌భుత్వ ప‌థ‌కాల అమ‌లు విష‌యంలో అధికార యంత్రాంగం వైఫ‌ల్యాల‌ను ఆయ‌న ప్ర‌స్తావించి అధికారుల మీద అసంతృప్తి వ్య‌క్తం చేశారు. అర్బ‌న్ హౌసింగ్ విష‌యంలో మంత్రి బాలినేని శ్రీనివాస‌రెడ్డి అధికారుల తీరును త‌ప్పు ప‌ట్టారు.

ఇలా అధికార‌, ప్ర‌తిప‌క్ష పార్టీల ఎమ్మెల్యేలు, నేత‌లు స‌మ‌స్య‌లు ప్ర‌స్తావించ‌డం, వాదోప‌వాదాల‌తో ప్ర‌కాశం జిల్లా అభివృద్ధి స‌మీక్షా స‌మావేశం మూడు గంట పాటు వాడీవేడీగా సాగింది.
Tags:    

Similar News