కొద్దిరోజులుగా ఏపీ రాజకీయాల్లో ‘పవన్ సీఎం’ మాట ప్రతిధ్వనిస్తోంది. ఏపీలో బీజేపీ-జనసేన కూటమి కట్టి కలిసి తిరుపతిలో పోటీచేస్తున్న సందర్భంలో ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు ‘పవన్ కళ్యాణ్ యే తమ ఉమ్మడి సీఎం అభ్యర్థి’ అంటూ చేసిన ప్రకటన సంచలనమైంది. ఇప్పటికీ దాని మీద చర్చ జరుగుతోంది.
తిరుపతి ఉప ఎన్నిక కోసం ప్రచారం సందర్భంగా సోమువీర్రాజు ఈ ప్రతిపాదన తీసుకొచ్చాడు. 2024 సార్వత్రిక ఎన్నికలలో జనసేనాని పవన్ కళ్యాణ్ బిజెపి-జనసేన కూటమి సీఎం అభ్యర్థిగా ఉంటారని ప్రకటించారు. దీనిపై ఎంతో మంది ఇప్పటికీ కామెంట్ చేస్తున్నారు. వకీల్ సాబ్‌లో పవన్ కళ్యాణ్ కు విలన్ గా నటించిన నటించిన ప్రకాష్ రాజ్ ఈ విషయంలో కొన్ని అద్భుతమైన వ్యాఖ్యలను తాజాగా చేశారు.
పవన్‌కళ్యాణ్‌ను సీఎం అభ్యర్థిగా ప్రకటించడానికి బీజేపీ ఎవరు? బీజేపీ నాయకులను ఎవరూ తీవ్రంగా పరిగణించకూడదని ప్రకాష్ రాజ్ హాట్ కామెంట్స్ చేశారు.. సీఎంగా అర్హుడిని అని పవన్ స్వయంగా ముందుకు వచ్చి తన భావజాలాన్ని బహిర్గతం చేయాలి ” అని ప్రకాష్ రాజ్ సూచించారు. ప్రజల్లో తనను తాను నిరూపించుకోవాలని ఫోకస్ కావాలని ప్రకాష్ రాజ్ సూచించారు.
జాతీయ అవార్డు గ్రహీత అయిన ప్రకాష్ రాజ్ చేసిన ఈ కామెంట్స్ వైరల్ అయ్యాయి. అసలు పవన్ బీజేపీతో పొత్తు పెట్టుకునే నిర్ణయం కరెక్ట్ కాదని విమర్శించారు. తాను పవన్ ను చాలా ఆరాధిస్తున్నానని.. అతడిని నిర్మాణాత్మకంగా విమర్శించానని ఇటీవల ప్రకాష్ రాజ్ స్పష్టం చేశాడు. తమ మధ్య వ్యక్తిగత వైరం లేదని.. కేవలం పార్టీల పరంగా భావజాలం మాత్రం వేరేనని ప్రకాష్ రాజ్ అన్నారు.