ఆయన బహు భాషా నటుడు. ఆయన ఫిలాసఫీ వేరు. బీజేపీ సిద్ధాంతాలు అంటే అసలు నచ్చని నటుడు ఆయన. అలాంటి ఆయన బీజేపీ చేసే ప్రతీ దాని మీద సోషల్ మీడియా ద్వారా తనదైన విశ్లేషణ చేస్తూంటారు. ట్విట్టర్ కి ప్రతీసారి పని చెబుతూ ఉంటారు. ఇపుడు ఆయనకు బీజేపీకి చెడుగుడు ఆడే చాన్స్ వచ్చింది. ఆయన దోస్త్ తెలంగాణా సీఎం కేసీయార్ వీడియోలు పెట్టి మరీ మా ఎమ్మెల్యేలను బీజేపీ కొంటోందని మీడియా సమావేశం పెట్టి చెప్పుకొచ్చారు.
అంతే కేసీయార్ ట్విట్టర్ హడావుడు మామూలుగా లేదు. బీజేపీ మీద వరసబెట్టి ట్వీట్లు అదే పనిగా చేస్తూ ఏకేకి వదిలిపెడుతున్నారు. ఢిల్లీ బ్రోకర్లు ప్రజాస్వామ్యాన్ని వేలం వేస్తున్నారు అంటూ హాట్ హాట్ కామెంట్స్ చేస్తున్నారు. సిగ్గులేని బ్రోకర్లు అంటూ బిగ్ సౌండ్ కూడా చేస్తున్నారు. ఢిల్లీ గ్యాంగ్ మాన మర్యాదలు అమ్ముకుంటున్నారు, ఆఖరుకు ప్రజాస్వామ్యాన్నే వేలం వేసే స్థితికి వచ్చారంటూ కేసీయార్ ప్రదర్శించిన వీడియోలను జత చేసి మరీ కమలనాధులకు మంటెక్కించారు.
కేంద్రంలో అధికారంలో ఉన్న అధికార పార్టీకి ఎమ్మెల్యేలను కొనుగోలు చేసి అలజడి సృష్టించడం అలవాటుగా మారిందని కూడా ప్రకాష్ రాజ్ ఫైర్ అయ్యారు. ఇంతలా దిగజారిపోవాలా అని ఆయన సూటిగానే ప్రశ్నించారు. దేశంలోని అనేక రాష్ట్రాలలో చేసిన పనినే తెలంగాణాలో కూడా చేస్తున్నారు. దొంగలకు పని వేరేది లేదు అంటూ విరుచుకుపడ్డారు.
కర్నాటక మహారాష్ట్ర ఇలా అన్ని రాష్ట్రాలలో ఇదే పని వారంతా ఫుల్ బిజీ అని ప్రకాష్ రాజ్ సెటైర్లు వేశారు. రాజకీయ భద్రతకు కండోంస్ ఇస్తునారా అంటూ బీజేపీని కడిగిపారేశారు. మరీ ఇంతలానా అంటూ బీజేపీ ఇలా చేయడం దారుణమని అన్నారు. ఇక తమ మిత్రుడు కేసీయార్ కి ఆయన ధైర్యం చెబుతూ ఈ సమయంలోనే మీరు స్ట్రాంగ్ గా ఉండాలని సూచించారు. మొత్తానికి ప్రకాష్ రాజ్ పొలిటికల్ రూటే సెపరేట్ అన్నట్లుగా బీజేపీతో ఒక ఆట ఆడుకున్నారు. నిజంగా ప్రకాష్ రాజ్ వేసిన ట్వీట్లకు బీజేపీ వారు ఏ రకంగా రెస్పాండ్ అవుతారో చూడాల్సి ఉంది.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.