షేక్ హ్యాండ్ ఇవ్వటం తెల్లోడి పద్ధతి. అదే మనమైతే.. ఎంచక్కా రెండు చేతులు గౌరవంగా పైకెత్తి.. వినయంగా నమస్కారం పెట్టేస్తాం. ఇలా స్వాగతం చెప్పటంలో.. హాయ్ అనేయటంలో ఎవరి స్టైల్ వారికి ఉంటుంది. అలాంటిదే న్యూజిలాండ్ వారికో పద్ధతి ఉంది. రాష్ట్రపతి ప్రణబ్ దా తాజాగా రెండు దేశాల పర్యటనలో భాగంగా న్యూజిలాండ్ కు వెళ్లారు. ఆయనకు గౌరవపూర్వకంగా స్వాగతం పలికేందుకు సంప్రదాయ దుస్తుల్ని ధరించారు. ఈ సందర్భంగా ఆయనకు స్వాగతం పలికే పనిలో భాగంగా.. కాస్త భిన్నమైన పంథాను అనుసరించారు.
ఒక యువకుడు.. ఒక మహిళ రాష్ట్రపతి ముక్కుకు.. ముక్కును రాస్తూ వెల్ కం చెప్పేశారు. ఇద్దరి మధ్య స్నేహానికి ప్రతీకగా ముక్కుకు ముక్కు రాసే పద్ధతి వారికి ఆచారంగా వస్తోంది. దీన్ని అనుసరించి ఆనవాయితీ స్వాగతం పలికారు. ఇప్పటికే ఎన్నో దేశాలు తిరిగిన ప్రణబ్ దాకు.. న్యూజిలాండ్ వారి స్వాగతం సరికొత్తగా అనిపించి ఉండొచ్చు.