గడిచిన నాలుగు రోజులుగా నభూతో అన్నట్లు సాగిన అయుత చండీయాగం మరికాసేపట్లో ముగుస్తుందనగా చోటు చేసుకున్న అగ్నిప్రమాదం కలకలం రేపిన సంగతి తెలిసిందే. ఈ అగ్నిప్రమాదం కారణంగా.. ఈ కార్యక్రమంలో పాల్గొనాల్సిన రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జి యాగశాలకు రాకుండానే వెనుదిరిగారు. ఎర్రవెల్లిలో జరుగుతున్న యాగానికి హాజరయ్యేందుకు రాష్ట్రపతి హెలికాఫ్టర్ లో చేరుకున్న సమయంలోనే అగ్నిప్రమాదం చోటు చేసుకుంది.
దీంతో ఒక్కసారిగా హడావుడి మొదలైంది. మంటలతో ఇబ్బందికర పరిస్థితి తలెత్తటంతో హెలికాఫ్టర్ లో వచ్చిన రాష్ట్రపతి హెలికాఫ్టర్ దిగకుండానే.. వెనుదిరిగి వెళ్లిపోయారు. ప్రణబ్ తో ఈ యాగాన్ని పూర్తి చేయాలని భావిస్తే.. అందుకు భిన్నమైన పరిస్థితి చోటు చేసుకుంది.