కీలకమైన ప్రతిసారీ ప్రణబ్ కు ఇంతేనా?

Update: 2016-12-06 07:13 GMT
దేశ రాష్ట్రపతిగా అందరికి తెలిసిన ప్రణబ్ ముఖర్జీకి సంబంధించిన మరో కోణం ఉంది. రాజకీయాల్లో తల నెరసిన ఆయన.. దేశంలోని మహామహా అధినేతలందరితోనూ ఆయనకు సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. అపర చాణుక్యుడిగా చెప్పుకునే ఆయన.. దక్షిణాదిలో ఏదైనా కీలకమైన సందర్భానికి రావాలనుకున్న ప్రతిసారీ ఏదో ఒక అడ్డంకి ఎదురు కావటం కనిపిస్తుంది.

ఏడాది కిందట (మరికొద్ది రోజుల్లో) హైదరాబాద్ కు సమీపంలోని ఎర్రవెల్లి దగ్గర తెలంగాణరాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన అయుత చండీయాగం చివరి రోజున ప్రణబ్ రావాల్సి ఉంది. అంతకు ముందంతా ప్రముఖులందరూ వచ్చి వెళ్లారు.కానీ.. ప్రణబ్ కాసేపట్లో యాగ స్థలి దగ్గరకు చేరుకుంటారని భావించిన సమయంలో యాగస్థలిలో చిన్నపాటి అగ్నిప్రమాదం చెలరేగటం.. దీంతో.. ఆయన ఎర్రవల్లిలో అడుగు పెట్టకుండానే తిరిగి వెళ్లిపోయారు.

తాజాగా దివంగత తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత అంతిమ సంస్కారాల కోసం ఆయన చెన్నై బయలుదేరారు. అయితే.. ఆయన ప్రయాణిస్తున్న విమానంలో సాంకేతిక లోపం తలెత్తటంతో ఆయన విమానం చెన్నైలో దిగకుండా వెనక్కి తిరిగి వెళ్లిపోయింది. ఈ నేపథ్యంలో జయలలితకు ప్రత్యక్షంగా ప్రణబ్ నివాళులు అర్పించే అవకాశం ఉంటుందా? అన్నది ఇప్పుడు ప్రశ్నగా మారింది. ఢిల్లీకి వెళ్లి.. మళ్లీ ప్రణబ్ మరో విమానంలో వచ్చే అవకాశం తక్కువగా ఉందన్న మాట వినిపిస్తోంది.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News