టీడీపీ ఎమ్మెల్యే కం హీరో బాలయ్య ‘అఖండ’పై వైసీపీ నేత రివ్యూ.. వైరల్

Update: 2021-12-03 12:40 GMT
టాలీవుడ్ అగ్రహీరో , టీడీపీ హిందూపూర్ ఎమ్మెల్యే నందమూరి బాలక్రిష్ణ నటించిన మూవీ 'అఖండ' రిలీజ్ అయ్యి టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా మారింది. 'అఖండ' సినిమా అద్వితీయ విజయం సాధించిందని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. ఈ క్రమంలోనే అఖండలో బాలయ్య విశ్వరూపంపై సినీ, రాజకీయ ప్రముఖులు కొనియాడుతున్నారు.

ఇప్పటికే టీడీపీ అధినేత చంద్రబాబు నుంచి గ్రామస్థాయి కార్యకర్తల వరకూ అఖండ సినిమాను ఆకాశానికి ఎత్తేస్తున్నారు. బాలయ్య సినిమా విడుదల నేపథ్యంలో టీడీపీ శ్రేణులు థియేటర్ల వద్ద మాస్ జాతర చేస్తున్నారు.

తాజాగా బాలయ్య సినిమాను వైసీపీ నాయకుడు, ప్రముఖ నిర్మాత ప్రసాద్ వి.పొట్లూరి (పీవీపీ) చూసి ట్వీట్ చేశారు. పీవీపీ కామెంట్స్ వైరల్ గా మారాయి. 'నా గమ్యం.. గమనం శివాధీనం.. అఖండ సినిమాను చూశాను. ఈ మహా మాస్ జాతరను పూర్తిగా అస్వాదించాను. దేవుడి దయతో 'అఖండ' ద్వారా తెలుగు సినిమా గత వైభవం మళ్లీ పూర్తి వెలుగులతో తిరిగి రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా' అని పీవీవీ పేర్కొన్నారు.

వైసీపీ విజయవాడ ఎంపీగా పోటీచేసిన పీవీపీ టీడీపీ ఎమ్మెల్యే అయిన బాలయ్య సినిమాపై కామెంట్స్ తో ట్విట్టర్ లో ఒక్కసారిగా వేడెక్కింది. కొందరైతే వైసీపీని వదిలేసి టీడీపీలోకి రావాలని రిక్వెస్ట్ చేయడం విశేషం.

ఇంకొందరైతే సినిమా టిక్కెట్ ధరలు తగ్గించి మీ సీఎం జగన్ నష్టపరుస్తున్నారని.. నిత్యావసరాలు పెట్రోల్ రేట్లు పెంచి సినిమా రేట్లు తగ్గించడం ఎంత వరకూ న్యాయం.. నువ్వైనా కాస్త చెప్పు అంటూ పీవీపీకి చురకలంటిస్తున్నారు. ఇప్పుడు ఈ ట్వీట్ సోషల్ మీడియాలో దుమారం రేపుతోంది. అందరూ దీనిపై తలో కామెంట్ చేస్తున్నారు.

https://twitter.com/PrasadVPotluri/status/1466595859504582659?s=20
Tags:    

Similar News