పీకేకు కోపం వచ్చింది. ఎన్నికల వ్యూహకర్తగా సూపర్ సక్సెస్ కావటమేకాదు.. ఆయన వ్యూహం సెట్ చేస్తే.. అలా జరిగిపోతుందన్నట్లుగా ఆయనకు ఇమేజ్ క్రియేట్ అయింది. తాజాగా ఆయన ఫలానా రాజకీయ నేత కోసం పని చేస్తున్నారంటూ సోషల్ మీడియాలో సాగుతున్న ప్రచారం అంతా ఇంతా కాదు. నెలకోసారి నేతల పేర్లు మార్చేస్తూ.. జరుగుతున్న ప్రచారంపై ప్రశాంత్ కిషోర్ తాజాగా ట్విట్టరులో స్పందించారు.
తాను ఎవరి కోసం పని చేస్తున్నానన్న విషయం పత్రికల ద్వారానే తెలుసుకుంటున్నట్లు ఆయన వ్యంగ్య వ్యాఖ్యలు చేశారు. తాజాగా ట్వీట్ లో ఆయన ఏమన్నారంటే... తాను ఎవరెవరి కోసం పని చేస్తున్న విషయం మీడియా ద్వారానే తెలుసుకుంటున్నానని.. ఇది చాలా కామెడీ విషయం అని అభివర్ణించారు.
త్వరలో జరగనున్న మహారాష్ట్ర ఎన్నికల్లో ఆదిత్య ఠాక్రేకు రాజకీయ సలహాదారుగా వ్యవహరిస్తున్నట్లుగా వార్తలు పెద్ద ఎత్తున వస్తున్నాయి. అంతేకాదు.. ఆయన్ను జన ఆశీర్వాద యాత్ర చేయాలని పీకే సలహా ఇచ్చినట్లుగా ప్రచారం జరుగుతోంది. తనకే మాత్రం సంబంధం లేని విషయాల్లో తన పేరును జత చేస్తున్న మీడియా తీరుపై పీకే ఎంత ఆగ్రహంతో ఉన్నారన్న విషయం ఆయన చేసిన తాజా ట్వీట్ చూస్తే.. ఇట్టే అర్థం కాక మానదు.