వారి నంబర్ పెంచేసిన పీకే...?

Update: 2022-04-10 09:07 GMT
ఏపీ పాలిటిక్స్ లో పీకే అన్నది తారక మంత్రంగా మారుతోంది. ఒక పీకే పవన్ కళ్యాణ్ జనసేన నేతలకు, క్యాడర్ కి నోట్లో నానే పేరుగా ఉంటారు. ఇక మరో పీకే అందే ప్రశాంత్ కిశోర్ వైసీపీ పెద్దల మదిలో సదా ఉంటారు. 2017 నుంచి వైసీపీలో పీకే పాలిటిక్స్ స్టార్ట్ అయింది. పీకే సూచనలతోనే అన్నీ చేసి బంపర్ విక్టరీ కొట్టేసింది వైసీపీ.

ఇపుడు మంత్రుల మార్పు, కూర్పు వెనక కూడా పక్కాగా పీకే డైరెక్షన్ ఉందని అంటున్నారు. పీకే సలహాల మేరకే సీనియర్లకు మళ్ళీ అందలం దక్కుతోందని కూడా మాట వినిపిస్తోంది. నిజానికి కేవలం ఇద్దరు ముగ్గురు తప్ప మిగిలిన వారందరినీ కొత్తగా తీసుకోవాలని  వైసీపీ పెద్దలు  తలచారని చెబుతారు.

అయితే ఇలా కనుక చేస్తే డేంజర్ గా సిట్యువేషన్ మారుతుందని పీకే చెప్పినట్లుగా తెలుస్తోంది. సీనియర్లు, పెద్ద తలకాయలు ప్రభుత్వంలో ఉండాల్సిందే. అది కూడా ఎన్నికల వేళ వారు బయట కంటే లోపల ఉంటే మేలు అన్న విలువైన సలహాలు అందాయని చెబుతున్నారు. అదే సీనియర్లను బయట ఉంచితే రాజకీయంగా ఇబ్బందులు కూడా తలెత్తుతాయని అంటున్నారు.

ఈ నేపధ్యంలోనే వైసీపీ అధినాయకత్వం సీనియర్ల సంఖ్యను ఏకంగా పది దాకా పెంచేశారు అని తెలుస్తోంది. అంతే కాదు, అవసరం అయితే ఆ సంఖ్య డజన్ కి కూడా చేరే వీలుందని అంటున్నారు. ఇక పీకే టీమ్ ఇచ్చిన మరో సలహా ఏంటి అంటే ప్రకాశం జిల్లా నుంచి సీనియర్ మినిష్టర్  బాలినేని శ్రీనివాసరెడ్డిని కొనసాగించాలని.

ఆయన ఉంటే ఆ జిల్లాలో వైసీపీ ఫ్యాన్ గిర్రున తిరుగుతుందని. సామాజిక సమీకరణలతో బాలినేనిని పక్కన పెడితే టీడీపీకి గట్టి పట్టున్న ఈ జిల్లాలో ఫ్యూచర్ లో  ఇక్కట్లు తప్పవని అంటున్నారుట. మరి దీని మీద చివరి నిముషంలో మార్పులు చేర్పులు ఉంటాయా అన్నది చూడాలి. ఇంకో వైపు చూస్తే ఏపీలో కొత్త మంత్రులల్లో కూడా గట్టి వారినే తీసుకుంటున్నారు. దాంతో వచ్చే ఎన్నికల వేళ వారితో చాల పని సులువు అవుతుందని అంటున్నారు.

ఇక పీకే సూచనలతో మంత్రివర్గం మొదట అనుకున్న షేపూ రూపూ మార్చుకుని ఇపుడు కొత్తగా మారుతోంది. సామాజిక సమీకరణలకు పెద్ద పీట వేస్తూనే అర్ధ బలం, అంగబలం ఉన్న వారిని దూరం చేసుకఒవద్దు అన్న సలహా సూచనల మేరకే ఎన్నికల క్యాబినేట్ రెడీ అవుతోంది అంటున్నారు.
Tags:    

Similar News