ఎన్నికల వ్యూహకర్త.. గత 2019లో వైసీపీని ముందుకు నడిపించిన ప్రశాంత్ కిశోర్‌తో ఈ పార్టీ తన బంధాన్ని తెంచుకుంది. తాజా గా ఈ విషయాన్ని వైసీపీ కీలక నేత, ప్రభుత్వ సలహాదారు.. సజ్జల రామకృష్నారెడ్డి వెల్లడించారు. పీకేతో తమకు సేవలు అవసరం లేదని.. చెప్పారు. అయితే, కాంగ్రెస్‌తో తాను కలిసి పనిచేయలేనని.. ఆ పార్టీలో చేరేది లేదని.. పీకే స్పష్టం చేసిన కొద్ది సేపటిలోనే వైసీపీ కూడా ఇలాంటి ప్రకటన చేయడం.. పీకేతో తమకు ఎలాంటి పనిలేదని చెప్పడం సంచలనంగా మారింది.
తాజాగా మీడియాతో మాట్లాడిన సజ్జల రామకృష్నారెడ్డి.. పీకేతో ఇకపై తాము కలిసి పనిచేయబోమని వెల్లడించారు. 'ప్రశాంత్ కిశోర్‌తో సీఎం వైఎస్ జగన్‌కి వ్యక్తిగత సాన్నిహిత్యం ఉంది. 2019 ఎన్నికల్లో ఆయన మాతో కలిసి పనిచేశారు. తరువాత ప్రశాంత్ కిశోర్ మాతో పనిచేయడం లేదు. భవిష్యత్‌లో పనిచేసే అవకాశాలు ఉండకపోవచ్చు. అని చెప్పారు. ``మాకు కాంగ్రెస్‌తో పొత్తు పెట్టుకోవాల్సిన అవసరం ఏముంది. రాష్ట్రంలో ఏ పార్టీతోనూ మాకు పొత్తు ఉండదు. ఒంటరిగానే పోటీచేయాలన్నది సీఎం వైఎస్ జగన్ సిద్ధాంతం`` అని సజ్జల వ్యాఖ్యానించారు.
వచ్చే ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్‌లో వైఎస్ఆర్‌సిపీతో పొత్తు పెట్టుకోవాలని కాంగ్రెస్ హైకమాండ్‌కు పీకే సలహా ఇచ్చినట్లు వచ్చిన వార్తలను ప్రస్తావిస్తూ, అలాంటి అవకాశం లేదని సజ్జల తోసిపుచ్చారు. ‘‘వచ్చే ఎన్నికల్లో మాతో పొత్తు పెట్టుకోవడానికి చాలా పార్టీలు ఆసక్తిగా ఉన్నాయేమో. కానీ మా అధినేత జగన్ ఒంటరిగా పోరాడుతున్నారు మరియు పొత్తులపై ఆసక్తి చూపలేదు. మాకు ఎలాంటి పొత్తులు అక్కర్లేదు, ఒంటరిగానే కొనసాగుతాం’’ అని చెప్పారు
అంతేకాదు.. తమతో పొత్తు పెట్టుకోవాలని గతంలోనూ పార్టీలు అనుకోవచ్చునని చెప్పారు. కానీ సీఎం జగన్ ఎప్పుడూ పొత్తుల్లేకుం డానే రాజకీయం చేస్తున్నారని సజ్జల వెల్లడించారు. కొన్ని నెలల క్రితం పార్టీ సీనియర్ నాయకులు మరియు మంత్రులతో జగన్ జరిపిన సమావేశంలో, ప్రశాంత్ కిషోర్ పార్టీ కోసం పని చేస్తూనే ఉంటాడనే వార్తల నేపథ్యంలో సజ్జల చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. వచ్చే ఎన్నికల కోసం ప్రశాంత్ ఇప్పటికే పార్టీ కోసం గ్రౌండ్ వర్క్ చేస్తున్నాడని, ఎమ్మెల్యేల పనితీరు మరియు అతని సంక్షేమ పథకాలపై ప్రజల అవగాహనపై ఫీడ్‌బ్యాక్ సేకరిస్తున్నట్లు నివేదికలు చెబుతున్నాయి.
మే నుంచి వైఎస్సార్‌సీపీ కోసం ప్రశాంత్ అండ్ టీమ్ పూర్తి స్థాయిలో పని చేసే సూచనలు కనిపిస్తున్నాయి. అయితే ఇప్పుడు ప్రశాంత్‌తో పార్టీ ఇకపై కొనసాగబోదని సజ్జల బహిరంగంగా ప్రకటించడంతో జగన్ మనసు మార్చుకున్నట్లు కనిపిస్తోంది. ఇదిలావుంటే, బుధవారం రాష్ట్రంలో టీడీపీ ఆందోళనలకు పిలుపునివ్వడం హాస్యాస్పదమని సజ్జల అన్నారు మహిళలకు ఎన్నడూలేని సాధికారత, భద్రత అందిస్తున్నామని సజ్జల చెప్పారు. సీఎం జగన్ ప్రభుత్వంలో మహిళా భాగస్వామ్యం అత్యధికమని చెప్పారు. ప్రజలు టీడీపీ చేసే నిరసనలు నమ్మరు అని సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు.