ఎండలతో మండిపోవాల్సిన స్థానంలో చల్లగాలులు గిలిగింతలు పుట్టిస్తున్నాయి. అదే సమయంలో రైతులకు కడగండ్లను మిగిలుస్తున్నాయి. ఆకాల వర్షాల పుణ్యమా అని రోగాలు దండెత్తే అవకాశం ఉందని కొందరు హెచ్చరిస్తుంటే.. వాతావరణ శాఖ అధికారులు మాత్రం ఇలాంటి అకాల వర్షాలు మరో రెండు.. మూడు రోజులు తప్పవని చెబుతున్నారు.
అల్పపీడన ద్రోణి.. ఉపరితల ద్రోణి కూడా ఉండటంతో రాయలసీమ.. తెలంగాణ ప్రాంతాల్లో వర్షాలు జోరుగా కురిసే అవకాశం ఉందని చెబుతున్నారు. ఈ ద్రోని తెలంగాణ.. రాయలసీమ.. ఉత్తర కర్ణాటక.. కేరళ.. లక్షద్వీప్ వరకూ వ్యాపించి ఉన్నాయని.. వీటి ప్రభావంతో వర్షాలు పడుతున్నాయని చెబుతున్నారు. కోస్తాలో కూడా వర్షాలు పడే అవకాశం ఉందని చెబుతున్నారు.
తాజాగా పడుతున్న వర్షాల కారణంగా.. రానున్న నెలల్లో వేసవితాపం తీవ్రంగా ఉంటుందని హెచ్చరిస్తున్నారు. ప్రీమాన్‌సూన్‌గా పేర్కొంటున్న ఈ వర్షాల కారణంగా ఎండలు మరింత పెరుగుతాయని.. తెలంగాణలో ఒకట్రెండు చోట్ల వడగళ్ల వాన పడే అవకాశం ఉందంటున్నారు. ఈ వర్షాల కారణంగా పంటలు భారీగా నష్టపోయే అవకాశం ఉందని చెబుతున్నారు. అరకొర పంటలతోఅల్లాడుతున్న అన్నదాతకు ఈ ఆకాల వర్షం శాపంగా మారనుంది.